పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం..కాని సమాజంలో పోలీసులంటే చిన్నచూపు ఉంది..దానికి కారణం సామాన్యులలో భయం అయితే..రాజకీయనాయకులకు లెక్కలేనితనం. అయితే చట్టం ఎవరి చుట్టం కాదని.. కర్తవ్యమే ప్రాణం అని నిరూపించిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథే ` గిద్దలూరు పోలీస్‌స్టేషన్`.
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీలో హీరో సీహెచ్‌వీ సుమన్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటించగా రఘుబాబు, అజయ్ ఘోష్, అదుర్స్ రఘు,గీతా సింగ్, నాగ మహేష్, నవీనా రెడ్డి, రామ్, అబ్దుల్, రాఘవ శర్మ మరికొంతమంది ప్రధాన తారాగణంగా నటించారు.
ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ రోజున సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తాం అని..అందరినీ అలరిస్తూనే ఆలోచించేలా కథ కథనం ఉంటుందని దర్శకుడు సీహెచ్‌వీ సుమన్ బాబు తెలియజేశారు.
హైదరాబాద్, అనంతపూర్, కర్ణాటక తదితర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిహెచ్ సుమన్ బాబు,
కథ,మాటలు: మురళి రమేష్,
మ్యూజిక్: ప్రమోద్ పులిగిల్ల,
రీ-రికార్డింగ్: చిన్నా,
ఎడిటర్: వెంకటప్రభు,
డీఓపి: గణేష్,
ఆర్ఠ్: ఆంటోని,
స్టంట్స్: దేవరాజు
లైన్ ప్రొడ్యూసర్: అబ్దుల్ రెహమాన్
పీఆర్ఓ: దుద్ధి శ్రీను