గ్రాండ్ గా ప్రారంభం కానున్న జెంటిల్‌మన్ 2 కంపోజింగ్

ఐకానిక్ అకాడమీ అవార్డు విన్నర్ ఎం.ఎం. కీరవాణి-కవిపెరరసు వైరముత్తు-కె.టి కుంజుమోన్ కొలాబరేషన్ లో వరల్డ్ ఫేమస్ బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్‌లో కంపోజ్ సెషన్  తమిళ పరిశ్రమ మెగా ప్రొడ్యూసర్ కె.టీ కుంజుమోన్ నిర్మించనున్న జెంటిల్‌మన్ 2 కంపోజింగ్ బిగిన్స్

ప్రముఖ నిర్మాత “జెంటిల్‌మన్” కె.టి. కుంజుమోన్ అనేక బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు. ‘జెంటిల్‌మన్‌” సినిమా ద్వారా దర్శకుడు శంకర్‌ని పరిచయం చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని క్రియేట్ చేశారు. 30 సంవత్సరాల తరువాత “జెంటిల్‌మన్ 2” పార్ట్ 2 ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఎ. గోకుల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కవిపేరరసు లిరిక్ రైటర్ వైరముత్తు సాహిత్యం అందిస్తుండగా అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ వర్క్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.

ప్రాజెక్ట్ మెటీరియలైజ్‌లో మొదటి దశగా, కె.టి. కుంజుమోన్ కొచ్చిలోని ప్రపంచ ప్రఖ్యాత బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్‌లో పాటల కంపోజింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.  ఎం.ఎం. కీరవాణి  జూలై 19న కవిపేరరసు పాటల రచయిత వైరముత్తుతో కలిసి  ఇక్కడికి చేరుకోనున్నారు.

ఈ ఇద్దరు దిగ్గజాలు కలసి గతంలో వరుస విజయాలు సాధించారు. కీరవాణి తమిళంలో చేసిన సేవగన్, వనమే ఎల్లై, జాతి మల్లి  చిత్రాలలో అనేక విజయవంతమైన పాటలని అందించారు. దర్శకుడు గోకుల్ కృష్ణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఈ జీనియస్ బృందంలో చేరుతున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత కె.టి.కుంజుమోన్ అత్యంత భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.  
 ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

10 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

10 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

10 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

10 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

10 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

16 hours ago