సరికొత్త మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కించిన “గేదెల రాజు” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ చైతన్య మోటూరి

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ చైతన్య మోటూరి.

  • మా స్వస్థలం అమలాపురం. నేను డాక్టర్ కావాలనేది మా కుటుంబ సభ్యుల కోరిక. ఇంటర్ అయ్యాక ఫిజియోథెరపీ చేశాను. ఒక క్లినిక్ ప్రారంభించాను. చదువుల్లో ముందున్నా, సినిమా, సాహిత్యం మీద ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచే కథలు, కవిత్వాలు రాసేవాడిని. ఆ ఆసక్తి అలా పెరుగుతూ వచ్చింది. క్లినిక్ నిర్వహిస్తున్నప్పుడే షార్ట్ ఫిలిం క్లబ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఆసక్తి ఉన్నవారిని చేర్చుకుంటూ వచ్చాను. అలా నాకంటూ ఒక టీమ్ తయారైంది. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉండేవారు. ఇలా కాకినాడలో షార్ట్ ఫిలింస్ చేస్తున్న టైమ్ లో డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మను సంప్రదించాను. ఆయన అమలాపురం, కాకినాడలో కొన్ని ప్లెజెంట్ విజువల్స్ తీసుకురమ్మని చెప్పారు. డ్రోన్ షాట్స్ తో సహా మంచి విజువల్స్ తీసుకెళ్లి చూపించాను. ఆయనకు నచ్చి నన్ను డైరెక్షన్ టీమ్ లోకి ఏడీగా తీసుకున్నారు. అలా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. డియర్ కామ్రేడ్ టైమ్ లో సినిమా వర్క్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు కూడా వర్క్ చేశాను. నేను మూవీ ట్రయల్స్ చేస్తూ ప్రొడ్యూసర్స్ కు కథలు చెప్పేవాడిని. వాళ్లకు నా కథలు నచ్చినా రెండో సినిమా చేద్దామని అనేవారు. మొదటి సినిమా ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా అనిపించేది. కొంతకాలం అయ్యాక ఇక బయట ప్రొడ్యూసర్స్ తో చాలా టైమ్ పడుతుందని మా నాన్నకు ఫోన్ చేసి నేనే తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పాను. ఆయన ఓకే అన్నారు. అలా గేదెల రాజు సినిమాకు అడుగుపడింది.
  • మొదట గేదెల రాజు చిత్రాన్ని చిన్న బడ్జెట్ లో చేయాలని అనుకున్నా. అయితే కథ స్పాన్ పెరగడం, ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ రావడంతో కొంత కొంతగా బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. లోకల్ గానే సినిమా అంతా చేయాలనుకున్నాం. యారీ కెమెరాలు వాడాం. గెదెల రాజు క్యారెక్టర్ కు మాత్రం నోటెడ్ ఆర్టిస్టును తీసుకోమని దర్శకులు భరత్ కమ్మ, దుశ్యంత్ సలహా ఇచ్చారు. అలా మా సెర్చింగ్ రఘు కుంచె గారి దగ్గరకు వచ్చింది. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ , గేదెల రాజు క్యారెక్టర్ కోసం ఎవర్నీ తీసుకోలేదు. రఘు కుంచె గారితో కథా చర్చలు చేశాక ఆయనలోని సింప్లిసిటీ నచ్చింది. పలాస లాంటి చిత్రాలు నేను చూశాను. గేదెల రాజు అనే రౌడీ షీటర్ క్యారెక్టర్ కు రఘు కుంచె గారు పర్పెక్ట్ గా సెట్ అవుతారని అనిపించింది. అలా ఆయన మా మూవీలోకి వచ్చారు.

  • కాకినాడ పరిసర ప్రాంతాల్లో రౌడీల గురించి నాకు తెలిసిన విషయాలు, స్థానికంగా జరిగిన ఘటనలు..ఇవన్నీ కలిపి ఈ కథ రాసుకున్నాను. ఇది ఏ ఒక్కరి కథ కాదు. నాకు తెలిసిన విషయాలెన్నో ఈ కథగా రాశాను. నేను కొత్త దర్శకుడిని కాబట్టి విలన్ నే మెయిన్ గా పెట్టి సినిమా చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనిపించింది. మనం సోషల్ మీడియోలో ఎన్నో క్రైమ్ స్టోరీస్ చూస్తున్నాం, యూట్యూబ్ లో క్రిమినల్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. అలా నేను విన్నవే ఈ కథకు స్ఫూర్తి. డెయిర్ ఫామ్ నడిపే గేదెల రాజు అనే రౌడీ షీటర్ కథ ఇది. మా తాతయ్య రోజూ మహాభారతం చదివి వినిపించేవారు. ఆయన చెప్పిన వాటిలో కనికుడి పాత్ర నాకు గుర్తుండిపోయింది. ధృతరాష్ట్రుడి పక్కనే ఉండే కనికుడు దుర్మార్గుడు. అతని నీతి ఏంటంటే నేనే గొప్ప, ఎదురొచ్చినవాడిని సమయం చూసి దెబ్బకొట్టాలి అనేది. ఇదే కనికనీతి. అడ్డొచ్చినవాడు కొడుకైనా కనికుడు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేవాడు కాదు. దీని గురించి ఇప్పటిదాకా మన మూవీస్ లో ఎవరూ చెప్పలేదు. కొత్తగా ఉంటుందని గేదెలరాజు సినిమాలో పెట్టాను.
  • మా మూవీకి ప్రధాన ఆకర్షణగా రఘు కుంచె గారి మ్యూజిక్ నిలుస్తుంది. ఆయన ఈ సినిమాకు మంచి బీజీఎం చేశారు. మాకున్న బడ్జెట్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ సౌండింగ్ ఇచ్చారు. సినిమా చూసిన వాళ్లు బీజీఎం గురించి, సాంగ్స్ గురించి మాట్లాడుకుంటారు. డాల్బీ అట్మాస్ లో సౌండింగ్ చేయించాం. మూడు పాటల్లో మెలొడీ సాంగ్, సెలబ్రేషన్ సాంగ్, గేదెలరాజు పోయినప్పుడు ఒక సరదా సెటైరికల్ సాంగ్ ఉంటాయి. గేదెలరాజు వుమైనజర్. అతను ఎంతోమందికి నగలు ఆశజూపి లోబర్చుకుంటాడు. ఆ మాట నెరవేర్చుకోడు. అలాంటి వాళ్లంతా గేదెలరాజు పోయినప్పుడు తిడుతుంటారు. కొందరు పొగుడుతుంటారు. అలాంటి వాళ్లందరి తిట్లు, పొగడ్తల నేపథ్యంతో ఈ పాట ఉంటుంది. గేదెలరాజు గా రఘు కుంచె గారు రియలిస్టిక్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక రౌడీ షీటర్ ఎలా నవ్వుతాడో, ఎలా మాట్లాడుతాడో, ఎలా కోపంగా చూస్తాడో అవన్నీ రఘు గారి పర్ ఫార్మెన్స్ లో సహజంగా చూస్తారు.
  • నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. వర్తమానంలో గతంలో జరిగినవి చూపిస్తూ మర్డర్ మిస్టరీ కథను ఆసక్తికరంగా తెరకెక్కించాను. ఇందులో రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా చూపిస్తున్నాం. మొత్తం ఐదు కథలు గేదెలరాజు చుట్టూ జరుగుతుంటాయి. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అనే క్యాప్షన్ కూడా మా మూవీకి పర్పెక్ట్ గా పెట్టాం. మా సినిమా చూసిన ఎవరూ కూడా కథలోని ట్విస్ట్ ను కనిపెట్టలేకపోయారు. మేము ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా పూర్తిగా నేచురల్ గా వెళ్లాం. ప్రతి పాత్ర మీరు ఎక్కడో చూసినట్లు, విన్నట్లు ఉంటుంది. గేదెలరాజు వేసుకుని డ్రెస్సులు కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కొన్నవే. ఇంత నేచురల్ గా తెరకెక్కించాం కాబట్టే సినిమా ఆడియెన్స్ కు నచ్చుతుందనే నమ్మకం పెట్టుకున్నాం.
TFJA

Recent Posts

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’.…

8 minutes ago

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని…

24 hours ago

మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి. వినాయక్

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం వి.ఎన్. ఆదిత్య అధ్యక్షతన ఏర్పడిన అనంతరం నిర్వహించిన తొలి మెడికల్ హెల్త్…

1 day ago

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్, వైరా బ్యానర్ ప్రెస్టీజియస్ మూవీ

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్…

1 day ago

చివరి దశలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌ ‘పురుష:’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

సరస్వతి బత్తుల సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ సినిమాతో పవన్…

1 day ago

“గేదెల రాజు” నాకు సమ్ థింగ్ స్పెషల్ మూవీ – యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల,…

1 day ago