‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో..

ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ..‘‘ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతోన్నారు. నాగ శివ గారికి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ .. ‘అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు. ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అర్జున్ లుక్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ పెద్ద హీరో అవుతాడు. జెన్నిఫర్‌కి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలి. దేవ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనాలు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకులు వీర శంకర్ మాట్లాడుతూ .. ‘పూరి గారి వద్ద పని చేయడం వల్ల శివకి సహనం ఎక్కువగా వచ్చినట్టుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సినిమాని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. ఫైనాన్షియల్ పరంగా నిర్మాతలు ఎప్పుడూ తెలివిగా ప్రవర్తించాలి. శివ తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అర్జున్ ప్రతీ ఫ్లాట్ ఫాం మీద తన సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. ఆయన మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈశ్వర్ మంచి విజువల్స్ ఇస్తారు. దేవ్ గారు మంచి సంగీతం అందిస్తారు. ఏప్రిల్ 24న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ .. ‘లెజెండరీ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారు మా ‘పరమపద సోపానం’ ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులు తీసిన సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఈ రోజు నా సినిమాకు వాళ్లు గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది. ప్రసన్న, శివ, వీర శంకర్ గారి వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ‘పరమపద సోపానం’తో మేం మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఏప్రిల్ 24న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ .. ‘‘పరమపద సోపానం’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాగ శివ గారు నా పాత్రను అద్భుతంగా రాశారు. ఇలాంటి ఓ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. అర్జున్ అంబటితో కలిసి మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన భీమనేని శ్రీనివాసరావు గారు, వీర శంకర్ గారు, సముద్ర గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అర్జున్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మా ఈ చిత్రం ఏప్రిల్ 24న రాబోతోంది. అందరూ చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

రాంబాబు గోసాల మాట్లాడుతూ ..‘‘పరమపద సోపానం’లో అన్ని పాటలు రాయడం ఆనందంగా ఉంది. దేవ్ గారు ఈ చిత్రానికి మంచి పాటల్ని, అద్భుతమైన ఆర్ఆర్‌ను ఇచ్చారు. శివ గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. అర్జున్ గారితో నేను ఇది వరకు పని చేశాను. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత గణపర్తి నారాయణరావు మాట్లాడుతూ .. ‘శివ మా అబ్బాయి. హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయ్యాడు. సినిమానే జీవితంగా మార్చుకున్నాడు. మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ .. ‘మా కోసం ఇక్కడకు వచ్చిన భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారికి థాంక్స్. నేను ఈ రోజు ఎక్కువ మాట్లాడను. ఏప్రిల్ 24న మా చిత్రం రాబోతోంది. ఆ రోజు మాట్లాడతాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ మాట్లాడుతూ .. ‘నాకు శివతో పదిహేనేళ్ల బంధం ఉంది. ఎప్పుడూ కథలు, స్క్రిప్ట్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఈ మూవీ కోసం శివ ఎంతో కష్టపడ్డారు. అర్జున్ అంబటి, జెన్నిఫర్ అద్భుతంగా నటించారు. ఇదొక ఎమోషనల్ మూవీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డీఓపీ ఈశ్వర్ మాట్లాడుతూ .. ‘‘పరమపద సోపానం’ అద్భుతమైన థ్రిల్లర్. అర్జున్‌లో అందరూ ఓ కొత్త యాంగిల్ చూస్తారు. జెన్నీఫర్ చక్కగా నటించింది. మా మ్యూజిక్, విజువల్స్ కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంతా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఏప్రిల్ 24న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

TFJA

Recent Posts

“క”, “కె ర్యాంప్” తర్వాత వస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది – హీరో కిరణ్ అబ్బవరం

తిరుపతిలో భారీ జన సందోహం మధ్య గ్రాండ్ గా హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ మ్యూజికల్…

4 hours ago

‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ…

23 hours ago

మంచి సినిమాకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు అని “బాలన్ – ది బాయ్” సినిమా మరోసారి ప్రూవ్ చేసింది – మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ చిదంబరం

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ "బాలన్ - ది…

23 hours ago

దిగ్ధర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా “హ్రీం” మూవీ టీజర్ లాంఛ్

పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "హ్రీం". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్…

1 day ago

సంగీత ప్రియులను కట్టిపడేస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం తొలి గీతం ‘నేనో బటర్‌ఫ్లై’

సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్ & సన్స్’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు…

2 days ago

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్…

4 days ago