సాయి మాధవ్ గారి చేతుల మీదుగా “గ్యాంగ్ స్టర్” మూవీ రిలీజ్ తేదీ పోస్టర్

చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా అక్టోబర్ 25 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ పోస్టర్ ని సాయి మాధవ్ బుర్ర గారు విడుదల చేశారు.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ..సినిమా లో టీజర్ మరియు ట్రైలర్ ఇంకా పోస్టర్స్ అధ్బుతంగా ఉన్నాయి …ఈ సినిమా కి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని విజయం వరించాలని కోరుకుంటున్నాను అన్నారు .

నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ – రెండు గ్యాంగ్స్ మధ్య వార్ ను మా డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ రిచ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. గ్యాంగ్ స్టర్ మా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

డిస్టిబ్యూటర్ అచ్చి బాబు మాట్లాడుతూ … సినిమా చాలా అద్భుతంగా వచ్చింది , ఇక రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్ తో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది ..అక్టోబర్ 25 న విడుదలయ్యే సినిమాని మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ – సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను.దిల్ రాజు గారు ట్రైలర్ చూసి బాగుందన్నారు. మా సినిమా తేదీ ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన మా సాయి మాధవ్ బుర్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో నిర్మాత బోగేంద్ర గుప్తా, సాయిమాధవ్ బుర్రా డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు ఎం అతిథులుగా పాల్గొన్నారు.
నటీనటులు – చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ తదితరులు
టెక్నికల్ టీమ్.
సమర్పణ – రవి అండ్ నరసింహా
బ్యానర్ – వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్
కెమెరామెన్ GL బాబు
Co డైరెక్టర్.. విజయ్ సారధి
పీఆర్ఓ – శ్రీపాల్ చొల్లేటి
ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్ రాథోడ్

Tfja Team

Recent Posts

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

8 hours ago

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…

13 hours ago

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

1 day ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

1 day ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

1 day ago