“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈరోజు “గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ ను మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ నయన్ సారిక, నిర్మాత వంశీ కారుమంచి, డైరెక్టర్ ఉదయ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, నటుడు కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి, సింగర్ అనురాగ్ కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – మీ కాలేజ్ లో “గం..గం..గణేశా” సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. బేబి సినిమాతో ఆనంద్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. మీ అందరి ఆదరణ పొందాడు. ఈ సినిమాతోనూ మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. మా సినిమా సాంగ్ మీకు నచ్చితే రీల్స్ చేయండి. మనతో పాటు మన ఫ్రెండ్ కూడా పాడవ్వాలని కోరుకునే ఫ్రెండ్స్ కొందరు ఉంటారు. అలాంటి ఫ్రెండ్ గా నేను ఈ సినిమాలో కనిపిస్తా. ఈ నెల 31న “గం..గం..గణేశా” థియేటర్స్ లోకి వస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అంతా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి. అన్నారు.
నటుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ – మీ అందరి ఎనర్జీ చూస్తుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ లో చేయబోయే సందడి కనిపిస్తోంది. మా “గం..గం..గణేశా” మూవీ నుంచి పిచ్చిగా నచ్చాశావే సాంగ్ ను మీ అందరి మధ్య రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మా టీమ్ పై మీరు చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. అన్నారు.
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. “గం..గం..గణేశా” సినిమాకు మంచి మ్యూజిక్ చేశాం. హిట్ సాంగ్స్ కోసం కష్టపడి పనిచేశాం. సినిమా మీద మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మీ అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. అన్నారు.
పాటల రచయిత సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాలో పిచ్చిగా నచ్చాశావే పాటకు లిరిక్స్ రాశాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ చేతన్ భరద్వాజ్ కు థ్యాంక్స్. అలాగే నన్ను ఇక్కడికి పిలిచిన హీరో ఆనంద్ గారికి థ్యాంక్స్. ఈ పాట మీ ఫోన్స్ లో మోగేలా ఉంటుంది. అన్నారు.
సింగర్ అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ – ఆనంద్ గారికి నేను రాసిన మూడో పాట ఇది. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ తో ఆర్ఎక్స్ 100 మూవీ నుంచి ట్రావెల్ చేస్తున్నా. మా కాంబోలో మంచి సాంగ్స్ వచ్చాయి. బేబి సినిమాతో మిమ్మల్ని ఆకట్టుకున్న ఆనంద్ గారు “గం..గం..గణేశా” సినిమాతో మరింత బిగ్ హిట్ అందుకుంటారు. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – పిచ్చిగా నచ్చాశావే పాట నచ్చిందా. మీకు మా పాట నచ్చితే రీల్స్ చేయండి. సోషల్ మీడియా ద్వారా మాకు ట్యాగ్ చేయండి. “గం..గం..గణేశా” లవ్, రొమాన్స్, యాక్షన్, హార్ట్ బ్రేక్ అన్నీ ఉంటాయి. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మా మూవీని చూడాలని కోరుతున్నా. అన్నారు.
కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాలో ఆనంద్ గుడ్ గయ్ కాదు. అతను జీవితంలో ఎదిగేందుకు ఎలా కష్టపడి దొంగతనాలు చేయాలో చెబుతుంటాడు. ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరంతా సినిమాను ఇష్టపడతారు. అన్నారు.
నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ – మీ అందరినీ చూస్తుంటే నేను చెన్నైలో చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ మంచి ఫ్రెండ్, రియల్ లైఫ్ లోనూ హీరో. “గం..గం..గణేశా” సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లా ఉంటుంది. మే 31న మీ ముందుకు వస్తున్నాం. మూవీని తప్పకుండా చూడండి. అన్నారు.
దర్శకుడు ఉదయ్ శెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” ఒక మంచి క్రైమ్ కామెడీ మూవీ. మీరు మీ ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మా మూవీని మిస్ కాకండి. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – నేను కొన్నేళ్ల కిందట స్పోర్ట్స్ ఆడేందుకు మీ కాలేజ్ కు వచ్చాను. ఇంత పెద్ద కాలేజ్ చూసి ఆశ్చర్యపోయాను. మన సొసైటీకి రేపటి ఫ్యూచర్ మీరే. మీలో చాలా మంది బాగా చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారని విన్నాను. మీ అందరి సమక్షంలో మా “గం..గం..గణేశా” సినిమా పిచ్చిగా నచ్చాశావే సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. బేబి సినిమాలో ఎంత ఏడ్చారో ఈ సినిమాలో నన్ను చూసి అంత నవ్వుతారు. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగా, విజయ్ దేవరకొండ తమ్ముడిగానే తెలుసు. బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా స్టోరీ సెలక్షన్స్ బాగుంటాయని చెబుతుంటారు. “గం..గం..గణేశా”లో స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి. క్రైమ్, కామెడీ, యాక్షన్ తో మీరంతా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. మే 31న థియేటర్స్ కు వెళ్లండి. చేతన్ భరద్వాజ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ ఎక్స్ 100, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలకు చేతన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలోనూ బృందావనివే వంటి ఛాట్ బస్టర్ అందించాడు. అనురాగ్ కులకర్ణి నాకు అమేజింగ్ సాంగ్స్ పాడాడు. బేబిలో ప్రేమిస్తున్నా సాంగ్ ను సురేష్ బనిశెట్టి అన్న రాశారు. ఈ పిచ్చిగా నచ్చాశావే సాంగ్ కూడా బ్యూటిఫుల్ గా రాశారు. ఉదయ్ శెట్టి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తో ఓపికగా ట్రావెల్ చేస్తూ ఎంతో కష్టపడి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. మనకు ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడు. అన్నారు.
‘పిచ్చిగా నచ్చాశావే’ పాటను హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక మధ్య రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా సురేష్ బనిశెట్టి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి పాడారు. పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా, కళ్లల్లో జల్లేశావే రంగులన్నీ భలేగా, పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా జంటగా వచ్చాశానే అందుకనేగా, మనసే పట్టి పట్టి మాయలోకి నెట్టేశావే, ప్రేమ గట్టి గట్టి కంకణంలా కట్టేశావే, నీ మువ్వల పట్టి గుండెకు కట్టి మోగించేశావే, ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేశావే..అంటూ మంచి బీట్ తో సాగుతుందీ పాట. పాట పిక్చరైజేషన్, పాటలో ఆనంద్ డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త స్క్రీన్ ప్రెజెంటేషన్ తో థియేటర్స్ లోకి వస్తున్న “గం..గం..గణేశా” ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతోంది.
నటీనటులు :
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.
టెక్నికల్ టీమ్ :
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం – చేతన్ భరద్వాజ్
లిరిక్స్ – సురేష్ బనిశెట్టి
బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…