టాలీవుడ్

నార్నే నితిన్ హీరోగా ప్రారంభ‌మైన సినిమా

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన‌ జీఏ 2 పిక్చ‌ర్స్ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో ఎప్పుడూ ముందుంటుంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వైవిధ్య‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్నారు వ‌రుస హిట్ చిత్రాల‌ను సొంతం చేసుకుంటున్నారు నిర్మాత‌ బ‌న్నీ వాస్‌. ఈ బ్యాన‌ర్‌లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, టాక్సీవాలా, ప్ర‌తిరోజు పండ‌గే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలను జీఏ 2 పిక్చ‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు అందించింది. తాజాగా ఈ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.9 సినిమా అన్న‌పూర్ణ గ్లాస్ హౌస్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో నార్నే నితిన్ హీరోగా న‌టిస్తున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్ మారుతి స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందఉన్న ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వ‌ర్క్ చేయ‌బోతున్నారు. నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న రెండో సినిమా ఇది. న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. అంజిబాబు కంచిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

కిర‌ణ్ కుమార్ మ‌న్నె ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి స‌మీర్ క‌ళ్యాణి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా రామ్ మిర్యాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

న‌టీన‌టులు:

నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: జీఏ2 పిక్చ‌ర్స్‌
నిర్మాత‌లు: బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి
స‌హ నిర్మాత‌: ఎస్‌.కె.ఎన్‌
ద‌ర్శ‌క‌త్వం: అంజిబాబు కంచిప‌ల్లి
సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ క‌ళ్యాణి
మ్యూజిక్‌: రామ్ మిర్యాల‌
ఎడిట‌ర్‌: కోదాటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: భాను ప్ర‌తాప్‌, రియాజ్ చౌద‌రి, అజ‌య్ గ‌ద్దె
కాస్ట్యూమ్స్‌: సుష్మిత‌, శిల్ప‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా, మేఘ శ్యామ్‌
డిజిట‌ల్‌: విష్ణు తేజ్ పుట్ట‌
పోస్ట‌ర్‌: అనంత్ కంచెర్ల‌

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

9 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago