ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సిినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.. అలాగే ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్‌లో మరింత వేగాన్ని పెంచుతూ తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి మార్చి 20, ఉదయం 11గంటలకు ‘సూఫియానా’ అనే తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన హిలేరియస్ కాన్సెప్ట్ వీడియోను శనివారం విడుదల చేశారు.
లిరికల్ సాంగ్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను గమనిస్తే.. హిలేరియస్‌గా ఆద్యంతం నవ్విస్తోంది. నార్నే నితిన్, నయన్ సారిక డబ్బింగ్ స్టూడియోలో కలుసుకోవటం.. తొలి పాటను విడుదల చేయాలని అనుకోగానే తను పాడుతానంటూ నయన్ సారిక ‘సూఫియానా..’ పాటను పాడటం హీరో, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల సహా అక్కడున్న మిగతా టీమ్ మెంబర్స్ దానికి భయపడటం.. అక్కడ ఇబ్బంది పడుతున్న టీమ్ హావభావాలకు జత చేసిన మీమ్స్ ఈ కాన్సెప్ట్ వీడియోను మరింత హిలేరియస్‌గా మార్చింది. చివరకు మ్యూజిక్ డైరెక్టర్ మార్చి 20న ‘సూఫియానా’ పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.
GA2 పిక్చర్స్:
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.
నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ – GA2 పిక్చర్స్
సమర్పణ – అల్లు అరవింద్
నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ – అంజి కంచిపల్లి
సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి
సంగీతం – రామ్ మిర్యాల
ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె
కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప
కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పోస్టర్స్ – అనిల్, భాను
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…