ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించిన మ్యాజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘టుక్‌ టుక్‌’

Must Read

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో చిత్రీకరించిన ‘ఏలా అల తీపికోరే పూలతోట’ పాట విడుదల

అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన సినిమాలు హాలీవుడ్‌ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్‌ టుక్‌ చిత్ర టీమ్‌. తొలిసారిగా ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది ఇండియన్‌ సినిమాలోనే తొలిసారి. ‘ఏలా అల తీపికోరే పూలతోట’ అనే కొనసాగే ఈపాట విజులవ్స్‌ ఏఐ టెక్నాలజీతో ఎంతో అందంగా, స్టనింగ్‌ విజువల్స్‌ బ్యూటీఫుల్‌గా జనరేట్‌ చేశారు.

దర్శకుడు సుప్రీత్ కృష్ణ సాహిత్యం అందించిన పాటకు సంగీత దర్శకుడు సంతు ఓంకార్‌ స్వరాలు అందించారు. ఏఐ ఈ పాటను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్‌ చేసింది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. దర్శకుడు మాట్లాడుతూ ‘ఏ ఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్‌ ఈ పాటను ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీని సినిమాల్లో తొలిసారిగా మా సినిమాకు వాడటం గర్వంగా ఉంది. సినిమా కూడా ఓ న్యూకాన్పెప్ట్‌లో ఉంటుంది. ఫాంటసీతో పాటు కొన్ని మ్యాజికల్‌ ఎలిమెంట్స్‌ చిత్రంలో ఉంటాయి. అవి ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాలో సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న చాలా సర్‌ఫ్రైజెస్‌ ఎంజాయ్‌ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి’ ముగ్గురు యువకుల ప్రయాణం. వాళ్ల జీవితంలో వచ్చిన మ్యాజికల్‌ ఎలిమెంట్స్‌ను ఎలా ఫేస్‌ చేశాడో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుందనే నమ్మకం ఉంది.’ ఫస్ట్‌ హాఫ్‌ ముగ్గురు యువకుల ఎంటర్‌టైన్‌ ఉంటే సెకండాఫ్‌లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఫాంటసీ, లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నాయి. మార్చి 21న అందరూ థియేటర్‌లో ఎంటర్‌టైన్‌ అవ్వొచ్చు. టైమ్‌కు, మనీకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది’ అన్నారు.అన్నారు. .

తారాగణం:
హర్ష రోషన్
కార్తికేయ దేవ్
స్టీవెన్ మధు
సాన్వీ మేఘన
నిహాల్ కోధాటి

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News