“అథర్వ” నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల

Must Read

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చే సినిమాల్లో రొమాంటిక్, లవ్ ట్రాక్ సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ ‘అథర్వ’ అనే చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్, సాంగ్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్యాచీ పాటను మేకర్లు విడుదల చేశారు.

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్‌ పాకాల బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, జావెద్ అలీ గాత్రం అన్నీ చక్కగా కుదిరాయి. ఇక డ్యాన్స్ మాస్టర్ రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ కూడా చూడచక్కగా ఉంది.

పాటను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. ‘మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్‌లోనే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని తెలియజేశాం. హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేక పోతాడు. ఆలా తన ఫీలింగ్‌ను సినిమాలో ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ పాట ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుందని ఎంచుకున్నాం.

శ్రీ చరణ్ ఈ పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తనకు జన్మదిన శుభాకాంక్షలు. మేం అడిగిన వెంటనే లిరిక్ రైటర్ మంచి పాట రాశాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంద’ని అన్నారు.

చిత్ర నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. ‘అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంతకుముందు మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు టీం అంతా చాలా కష్టపడ్డాం. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని అన్నారు.

హీరో కార్తీక్ మాట్లాడుతూ.. ‘కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన భీమనేని శ్రీనివాస్ రావు గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రోజు మేము విడుదల చేసిన సాంగ్ ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు సినిమాను చాలా బాగా తీశాడు. నిర్మాత సుభాష్ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చడమే కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు’ అని అన్నారు

.

హీరోయిన్ సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా ఇందులో చాలా ఏమోషన్స్ ఉన్నాయి. నేను డ్యాన్సర్ అయినా నాకు ఇందులో ఒక్క స్టెప్ వేసే అవకాశం కూడా రాలేదు. టీం అంతా కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నా కో స్టార్ కార్తీక్ చాలా హానెస్ట్ పర్సన్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు విడుదల చేసిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంద’ని అన్నారు.

నటుడు గగన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి రింగా రింగా అనే పాట తెలియని వారుండరు. ఇప్పుడు అలాంటి పదంతో మేము విడుదల చేసిన రింగ రింగా రోసే సాంగ్ కూడా కచ్చితంగా ట్రెండ్ అవుతుంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా ద్వారా మాకు, దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు కిరణ్ మచ్చ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్ నుంచి వచ్చిన నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీ చరణ్ అన్న చేసిన రింగ రింగ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంద’ని అన్నారు.

కొరియోగ్రాఫర్ బాను మాస్టర్ మాట్లాడుతూ.. ‘మహేష్ అన్న నాకు సాయి ధర్మతేజ్ తిక్క సినిమా నుండి పరిచయం. తను ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి చాలా బాగా నటించారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన రింగ రింగ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో వస్తున్న మా సినిమాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు విజయ్ రామారాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి మా తో పాటు దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాల’ని అన్నారు.

రమణ మాట్లాడుతూ.. ‘అందరికీ గుర్తుండిపోయే సినిమాగా ఈ “ఆథర్వ” నిలుస్తుంద’ని అన్నారు.

నటీనటులు 

కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు

సాంకేతిక నిపుణులు 

సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ 
బ్యానర్: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ 
రచన,దర్శకత్వం: మహేష్ రెడ్డి 
నిర్మాత: సుభాష్ నూతలపాటి
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌: విజయ, ఝాన్సీ 
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డిఓపి చరణ్ మాధవ నేని
ఎడిటింగ్ ఎస్.బి ఉద్ధవ్
ఆర్ట్ రామ్ కుమార్
లిరిసిస్ట్ :  కాసర్ల శ్యామ్ కిట్టు విస్సా ప్రగడ
కొరియోగ్రాఫర్స్ భాను రాధాకృష్ణ విజయ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్ పర్వతనేని రాంబాబు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News