జిలేబి’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు: ‘జిలేబి’ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా విరామం చేసిన యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజు అశ్రాని చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచమైన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 18న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపద్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో దర్శకుడు కె. విజయభాస్కర్ మాట్లాడుతూ.. ఇంత మంచి ఫన్ ఎంటర్ టైనర్ ని ఎంచుకొని, ఎక్కడా రాజీపడకుండా ఒక పెద్ద సినిమాలా నిర్మించిన నిర్మాతలు రామకృష్ణ, అంజుఅశ్రాని కి ధన్యవాదాలు. సినిమాపై వున్న నమ్మకంతో సొంతగా రిలీజ్ చేశారు. సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం ప్రొడక్షన్ లా ఎక్కడా అనిపించదు. ‘జిలేబి’ సినిమా చదువుకునే రోజులు, హాస్టల్ డేస్ ని మళ్ళీ గుర్తుకు తెచ్చింది. ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే. ఐతే చదువుకునే రోజుల్లో పరీక్ష ఒత్తిడితో రాసేవాళ్ళం. ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తూ రాస్తాం. సినిమాలో వినోదం ఎలా వుందో ప్రేక్షకులు చూసి చెప్పాలి.
శ్రీకమల్, శివానితో పాటు నటీనటులంతా చక్కగా నటించారు. రాజేంద్రప్రసాద్ గారు, మురళీశర్మ వారి అనుభవాన్ని జోడించారు. మణిశర్మ చక్కని సంగీతం అందించారు. రామజోగయ్యశాస్త్రీ గారి లిరిక్స్ హైలెట్. అలాగే భాను అద్భుతంగా కోరియోగ్రఫీ చేశారు. అందరూ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. కమల్ ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంకా మీ ప్రేమ కావాలి. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని ప్రామిస్ చేయగలం. సినిమా చూసిన తర్వాత మీ ఫీడ్ బ్యాక్ ని ఇవ్వండి” అని కోరారు.
హీరో శ్రీ కమల్ మాట్లాడుతూ.. ‘జిలేబి’ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా అనందంగా వుంది. మార్నింగ్, ఈవెంట్ షోస్ కంటే నైట్ షోస్ ఇంకా పెరిగాయి. థియేటర్స్ ఇంకా పెరుగుతున్నాయి. నా మొదటి సినిమాకి ఇంత మంచి ఫీడ్ బ్యాక్ రావడం సర్ ప్రైజ్ గా వుంది. ఈ సినిమా ఇంకా పెద్ద లెవల్ కి వెళ్లాలని ప్రేక్షకులని కోరుకుంటున్నాను. అందరూ సినిమా చూడండి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఇది మా గ్యారెంటీ. థియేటర్ కి రండి.. నవ్వుతూ బయటికి వెళ్తారు” అన్నారు.
నిర్మాత గుంటూరు రామకృష్ణ మాట్లాడుతూ.. జిలేబి చిత్రానికి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా డీసెంట్ మూవీని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. కామెడీ చాలా బావుందని రివ్యూస్ వస్తున్నాయి. సినిమా ఫలితం పట్ల చాలా ఆనందంగా వుంది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు
నిర్మాత అంజు అశ్రాని మాట్లాడుతూ.. జిలేబి చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మేము ఇంకా మంచి మంచి హిట్స్ తో మీ ముందుకు వస్తాం. జిలేబి సినిమా షోస్ ని ప్రతి చోట ఇంకా పెంచుతున్నాం. ప్రేక్షకులు మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు” తెలిపారు
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. సినిమా చూసిన వారంతా హాయిగా నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు మాకు దీవెనలుగా భావిస్తున్నాం. ఇంతమంచి ఎంటర్ టైనర్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” తెలిపారు సన్నీ మాట్లాడుతూ.. జిలేబి సినిమా చూసినవారంతా చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. చాలా నందంగా వుంది. సినిమా చూసిన వాళ్ళు మరో నలుగురికి చెప్పాలని కోరుకుంటున్నాను. విజయభాస్కర్ గారి గత చిత్రాల్లానే జిలేబిలో కూడా చాలా ఆహ్లాదకరమైన కామెడీ వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” తెలిపారు.
సాయి కుమార్ బబ్లూ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ గారి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా, చాలా మంచి రోల్ ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన విజయభాస్కర్ గారి సినిమాలో చేయడం అనందంగా వుంది. సినిమా మంచి విజయం సాధించింది. జిలేబిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాని ఇంకా పెద్ద విజయం చేస్తారని ఆశిస్తున్నాను”అన్నారు.
హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో…
జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…
భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…
తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన…