టాలీవుడ్

టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..“మిస్టీరియస్”

సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా “మిస్టీరియస్” టైటిల్ పోస్టర్ లాంచ్

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్),అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations) బ్యానర్ పై ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా లెవెల్లో చేస్తున్నఈ సినిమా సౌత్ లో ఉన్న అన్ని భాషలలో చేస్తున్న సినిమా చాల బాగుంది పోస్టర్ సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నాను . “మిస్టీరియస్” టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.

దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాము. చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థాంక్స్ మా టైటిల్ పోస్టర్ లాంచ్ చేయటం.

చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నిర్మాతను ఆయన అభినందించారు.

నిర్మాత జయ్ వల్లందాస్ (USA) మాట్లాడుతూ, తెలంగాణ Cinematography మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థాంక్స్ మా టైటిల్ పోస్టర్ లాంచ్ చేయటం. క్లైమాక్స్ వరకు ఉత్కంఠను నింపడం ఈ చిత్రం మాస్టర్ క్లాస్ అని అన్నారు. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేకం అని అన్నారు
ఎక్కడ రాజీ పడకుండ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు మంచి పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడు M.L రాజా మధురమైన సంగీతాన్ని అందించారని త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక నుండి ఎవరీ వీక్ ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నాము తప్పకుండ మిమ్మల్ని అలరిస్తుంది అని . మా సినిమా ని ఆదరించి ఘానవిజయం చేయాలి అని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో హీరోలు మరియు ఇతర నటీనటులు పాల్గొన్నారు .

నటీనటులు : ప్రధాన తారాగణం:
రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్),అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), రియా కపూర్ (హీరోయిన్), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి,,వేణు పోల్సాని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

17 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago