మిమ్మల్ని గౌరవించిన చిత్ర పరిశ్రమలను మీరు గౌరవించండి – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్..!!

Must Read

ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడే అవకాశాలు పొంది ఇదే పరిశ్రమలను కించపరిచేలా మాట్లాడుతున్న నాయికలను ఉద్దేశించి తనదైన శైలిలో పోస్ట్ చేశారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందిస్తూ – టాలీవుడ్ లో, సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న కొందరు నాయికలు కొన్నేళ్ల తర్వాత ఇదే పరిశ్రమను విమర్శించడం తగదు. సదరు నాయికలు ఇక్కడి కథలు, సంప్రదాయాలను తప్పుగా పేర్కొంటున్నారు. ప్రతి యాక్టర్ కు తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సద్విమర్శలు చేయకుండా మిమ్మల్ని ఆహ్వానించిన పరిశ్రమనే చిన్న చూపు చూసేలా మాట్లాడటం సరికాదు. తెలుగు సినిమా, దక్షిణాది సినిమా పరిశ్రమలు కథల్లో తమదైన సంప్రదాయాలను, సంస్కృతులను ప్రదర్శిస్తాయి. బయటి వాళ్లకు అవి అసాధారణంగా అనిపించవచ్చు. మాకు మాత్రం ఆ సంప్రదాయాలు, సంస్కృతులు పరిచితమే. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. అవకాశాలు వచ్చినప్పుడు ఎంతో అపురూపంగా భావించిన మీరు ఇప్పుడు వాటిని కించపరచడం అంగీకారం కాదు. మాదే గొప్ప సంస్కృతి అనేలా ప్రవర్తించడాన్ని ఎవరూ ఒప్పుకోరు. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను గౌరవించండి. అన్నారు.

Latest News

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "యద్భావం తద్భవతి". వరుణ్...

More News