నటుడు నితిన్ నార్ణే భుజం సర్జరీ విజయవంతం..!

Must Read

ప్రముఖ నటుడు నితిన్ నార్ణే ఇటీవల సినిమా షూటింగ్‌లో కుడి భుజానికి గాయమవడంతో, November 4న కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ఉదయం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మరియు వారి బృందం (డా. ఈశ్వర్ పటేల్, డా. హರಿಕృష్ణ బచ్చు, డా. మధుసూదన్) ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజులు విశ్రాంతి, పునరావాసం (rehabilitation) అవసరమని వైద్యులు సూచించారు.
ఈ సమయంలో కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి.

Latest News

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "యద్భావం తద్భవతి". వరుణ్...

More News