టాలీవుడ్

#SDT18 “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” రిలీజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సాయి దుర్గ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” అనే ఎక్సయిటింగ్  వీడియోను విడుదల చేసారు. ఈ వీడియో మూవీ యూనివర్స్ ని గ్లింప్స్ గా ప్రజెంట్ చేసింది. ఈవిల్ ఫోర్స్ కారణంగా చాలా కాలంగా కష్టాలు ఎదురుకుంటున్న ఓ నేల, తన రక్షకుని రాక కోసం ఎదురుచూస్తుంటుంది, ఫైనల్ గా వారి నిరీక్షణ ముగుస్తుంది.

ఈ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేస్తోంది. స్టన్నింగ్ సెట్స్, కాంప్లెక్స్ వెపన్స్ ని తయారు చేయడం, నటీనటులను వారి పాత్రలు కోసం అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడం ఈ వీడియోలో కనిపిస్తోంది.  హీరోని బీస్ట్ మోడ్ లో ప్రజెంట్ చేసిన ఫైనల్ ఫ్రేమ్స్ అదిరిపోయాయి. ఈ వీడియో ప్రేక్షకులు చూడబోయే అద్భుతానికి థ్రిల్లింగ్ ప్రివ్యూగా నిలిచింది.

ఆర్కాడీ వరల్డ్ లోకి ఈ స్నీక్ పీక్ చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సాయి దుర్గ తేజ్ బీస్ట్ మోడ్‌ స్టన్నింగ్ గా అనిపించింది. ఇది లార్జర్ దెన్ లైఫ్ స్టొరీ అని హింట్ ఇచ్చింది.  

సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది.  మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

9 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago