మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో నిర్మాత కె.కె.రాధామోహన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
క్రేజీ ఫెలో దసరా, దీపావళికి మధ్యలో విడుదలౌతుంది కదా.. ఇది ఎలాంటి సమయం అనుకుంటున్నారు ?
కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో వున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. నవంబర్ డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాలు వున్నాయి. అయితే ప్రస్తుతం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం పెద్ద సవాల్. క్రేజీ ఫెలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దినితో పాటు వైవిధ్యమైన ప్రమోషన్స్ చేస్తున్నాం. రెండు వెహికల్స్ తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. ప్రతి చోట ట్రైలర్, సాంగ్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాం. దీనితో పాటు టీవీ కమర్షియల్, పోస్టర్స్, గూగుల్ యాడ్స్ ,అన్ని రకాలుగా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం వున్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం వుంది.
కథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి ?
క్రేజీ ఫెలో కథ చాలా బావుటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా వుంటుంది. ఆది క్యారెక్టర్ చాలా క్రేజీగా కొత్తగా వుంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ వుంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో.
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారిందా ?
చాలా మారింది. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్ నేషనల్ కంటెంట్ దొరుకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం మాకు సవాల్. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్.
మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ సినిమా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి కదా ?
మొదట్లో శాటిలైట్,, ఇప్పుడు ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్ కి 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన భాద్యత నిర్మాతపైనే వుంటుంది. యూఎస్ నుండి షిఫ్ట్ అయిపోయాను. పూర్తి సమయం సినిమాలకి కేటాయించాను. గత మూడేళ్ళుగా ఓరేయ్ బుజ్జిగా, ఓదేల రైల్వే స్టేషన్.. ఇప్పుడు క్రేజీ ఫెలో చేశాం. స్పీడు పెంచుతూనే రిస్క్ ని బ్యాలన్స్ చేస్తేనే ఇండస్ట్రీలో వుండగలం. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ద్, కార్పోరేట్ స్టయిల్ లో వుంది. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను.
మీ నిర్మాణంలో మీకు తృప్తిని ఇచ్చిన చిత్రాలు ?
కథ పరంగా అధినేత నాకు చాలా తృప్తిని ఇచ్చిన చిత్రం. ఏమైయింది ఈవేళ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మారుతి లాంటి దర్శకులు ఆ సినిమాతోనే స్ఫూర్తి పొంది సినిమాలు చేశామని చెబుతుంటారు. పంతం సినిమాలో ఇచ్చిన సందేశం కూడా నచ్చుతుంది. కమర్షియల్ గా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం రవితేజ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ నిర్మాత అనే గుర్తింపు తెచ్చింది.
ఈ చిత్రంలో ఇద్దరి కథానాయికలు గురించి ?
దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ ఇద్దరూ చాలా చక్కగా చేశారు. మిర్నా మీనన్ కి ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్రలో మంచి సర్ ప్రైజ్ వుంటుంది.
సంగీతం గురించి ?
ఆర్ఆర్ ద్రువన్ అప్ కమిగింగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐదు పాటలు డిఫరెంట్ వేరియేషన్స్ లో చేశాడు. ఆర్ఆర్ ని కూడా చాలా బ్రిలియంట్ గా చేశాడు. మ్యూజిక్ విషయంలో తృప్తిగా వుంది.
కొత్తగా చేయబోతున్న చిత్రాలు ?
ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం.
ఆల్ ది బెస్ట్
థాంక్స్