‘ఉషా పరిణయం’ చిత్రాన్ని అందరూ చూడాలి: హీరో సాయి దుర్గ తేజ్‌

Must Read

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె.విజయ్‌భాస్కర్‌ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ ‘తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వలో నేను ప్రేమకావాలి అనే సినిమా చేయాల్సింది అది మిస్‌ అయ్యింది. ఆది సాయికుమార్‌ నా రేయ్‌ చేయాలి.. ఆది ప్రేమకావాలి చేశాడు. నేను రేయ్‌ చేశాను. అలా మారిపోయింది. కమల్‌ నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్‌. ఈ రోజు హీరోగా చేయడం హ్యపీగా వుంది. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ సంగీతం చాలా బాగుంటుంది. ఆల్‌ దబెస్ట్‌ . నాకు ఎంతో ఆప్తుడు అయిన సతీష్‌ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్‌ తన్వీ. తన్వీ కూడా మా రికమండేషన్‌తో ఈ సినిమా చేయడం లేదు. ఎంతో కష్టపడి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసి ఈ అవకాశం పొందింది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే..ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయ్‌భాస్కర్‌ గారికి మంచి విజయా చేకూరాలి’ అన్నారు.

దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ‘సాయి ద రియల్‌హీరో.. సాయి దుర్గ తేజ్‌ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తరువాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్‌ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో వున్నాడో.. ఈ రోజు అలాగే వున్నాడు, చిరంజీవి గారి దగ్గర వున్న ప్రేమ సాయిలో కనిపించింది. మమ్ములను టీమ్‌ను ఎంకరైజ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా వుంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి ధ్రువన్‌ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మా ఇద్దరికి ట్యూన్‌ అయ్యింది. సతీష్‌ ఫోటోగ్రఫీ ఈసినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యింది. తన్వీ స్వీటెస్ట్‌ గర్ల్‌. చాలా కంఫర్టబుల్‌ హీరోయిన్‌. నో ప్రాబ్లెమ్‌ గర్ల్‌. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బంది అయినా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది. సినిమాలో టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌ కూడా ఎంతో ఓన్‌ చేసుకుని ఈ సినిమా చేశారు’ అన్నారు.

హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ ‘అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్‌ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాను. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి. సాయి అన్నరావడం నా జీవితంలో మరిచిపోలేను. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి మమ్ములను ఎంకరైజ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నాన్న గారు నాకు దేవుడు. ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. తాన్వీ ఆకాంక్ష.. చాలా మంచిగా పెంచారు. చాలా కంఫర్టబుల్‌ నో ప్రాబ్లమ్‌ గర్ల్‌. ఆమెతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లి, బావ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారు. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్‌ త్వాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ ‘సాయి దుర్గ తేజ్‌ అన్న రావడం చాలా సంతోషంగా వుంది. నేను సక్సెస్‌ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. అన్న అంటే నాకు చాలా గౌరవం. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పడు నాన్న మొదట సాయి అన్నకే చెప్పాడు. మీరు చాలా సంతోషపడ్డారని తెలిసింది. విజయ్‌భాస్కర్‌ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌ యూ. సినీ పరిశ్రమలోకి రావాలన్న నా కోరిక ఈ సినిమా తీరింది. సినిమా పట్ల ఆయన ఎంతో అంకితభావం వున్న వ్యక్తి. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అందరూ నువ్వు చాలా లక్కీ అన్నారు. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. కమల్‌లో మంచి నటుడు,డ్యాన్సర్‌ వున్నాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరూ చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ఎంతో థ్యాంక్స్‌. కాస్ట్యూమ్‌ ఈ రోజు అంత అందంగా వున్నయాంటే దానికి కారణం శామ్‌ అక్క. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని
నాకు నటిగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.

కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శాన్వి మాట్లాడుతూ సాయి దుర్గ తేజ్‌ వచ్చినందుకు ఎంతో సంతోషంగా వుంది. మీ మదర్‌ నేమ్‌ మీ పేరులో యాడ్‌ చేయడం రియల్లీ గ్రేట్‌. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. కమల్‌ మంచి నటుడు. రేపు సినిమా విడుదల తరువాత అందరికి తెలుస్తుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.

నటుడు రవిశివ తేజ మాట్లాడుతూ ‘విజయ్‌భాస్కర్‌ గారు ఆర్టిస్ట్‌ ఎవరైనా సరే పాత్రకు సరిపోతే వాళ్ల నుంచి నటనను రాబట్టుకుంటాడు. దటీజ్‌ ఆయన గ్రేట్‌నెస్‌. ఆ కాన్ఫిడెన్స్‌తోనే అందరూ కొత్తవాళ్లతో ఉషా పరిణయంను తీశాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అయ్యే అన్ని ఎలిమెంట్స్‌ వున్నాయి. ఈ సినిమా కోసం నా భార్య శాన్వి ఎంతో కష్టపడింది. తన నాన్న విజయ్‌భాస్కర్‌ ఇబ్బంది పడకూడదని ప్రొడక్షన్‌లో అన్నీ తానై చూసుకుంది. శాన్వీ నా వైఫ్‌ అయ్యినందుకు ఎంతో గర్వంగా వుంది. ఈ సినిమాలో నేను కూడా ఓ మంచి పాత్ర చేశాను. హీరోగా కమల్‌ ఇరగదీశాడు. ఇంతమంది కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్‌ సాధిస్తుందనే విశ్వాసం వుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు శివాజీ రాజాతో ఫణి, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, కెమెరామెన్‌ సతీష్‌ ముత్యాల, కో-డైరెక్టర్‌ కాళీ తదిరులు పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News