‘రాజా రమ్యం’ సినిమా నుంచి ‘ఏమి పాపం…’ లిరికల్ సాంగ్ రిలీజ్

Must Read

Love Songs | Pora Pora Full Song | Raja Ramyam | Silly Monks

విగ్నేష్ రెడ్డి గవి, శ్రీ ఆశ్రిత జంటగా నటిస్తున్న సినిమా ‘రాజా రమ్యం’. విలేజ్ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రనిల్ గౌరీ పాగ రూపొందిస్తున్నారు. గావి ఫిలిమ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పై కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఏమి పాపం..’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఏమి పాపం పాటకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించడంతో పాటు పాడారు. ‘ఏమి పాపం ఏమి పాపమురా…పసిపోరలు పచ్చులాయనురా..ఎవని శాపం ఎవని శాపమురా..అసలెందుకీ హెచ్చు తగ్గులురా..

‘అంటూ హార్ట్ టచింగ్ లిరిక్స్, ట్యూన్ తో సాగుతుందీ పాట. ఈ పాటను స్వరపర్చి ఎమోషనల్ గా పాడారు చరణ్ అర్జున్. సినిమాలో బాధాకరమైన సందర్భంలో ఈ పాట చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉన్న ‘రాజా రమ్యం’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

దర్శకత్వం : ప్రనీల్ గౌరిపాగ
కథ & స్క్రీన్ ప్లే : ఆర్యన్ గండికోట (జి యాదగిరి)
నిర్మాతలు : కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
బ్యానర్లు : గవి ఫిల్మ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
సంగీతం : చరణ్ అర్జున్
ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం
డీ ఓ పి : ప్రవీణ్ కె బంగారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం
ఆర్ట్ : వెంకటేష్
పీఆర్వో – GSK మీడియా
లైన్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ బిల్లకుర్తి
కొరియోగ్రాఫర్ : మోహన్ కృష్ణ
డైలాగ్స్ : అనిల్ మల్లెల & వి.సూర్య
సాహిత్యం : చరణ్ అర్జున్, లక్ష్మీ ప్రియాంక

Latest News

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని...

More News