రష్మిక మందన, రెయిన్‌బో’ గ్రాండ్ గా ప్రారంభం

రష్మిక మందన ప్రధాన పాత్రలో బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్  ‘రెయిన్‌బో’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు అనౌన్స్ చేశారు.  ప్రారంభం నుంచి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ, దాని విలక్షణమైన కథాంశాలు, నాణ్యమైన నిర్మాణ విలువలకు పేరుపొందింది. ఖాకీ, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం (OOJ) వంటి సినిమాలతో సంస్థ అసాధారణమైన విజయాల్ని వరుసగా అందిస్తుంది.

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ అన్ని వర్గలా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించనుంది. నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమరా స్విచాన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్ అందించారు. సందీప్ కిషన్, శరత్ మరార్, సుప్రియ అక్కినేని, బాపి, వెంకీ కుడుముల, కె కె రాధా మోహన్, దామోధర్ ప్రసాద్,  దర్శకుడు శశికిరణ్, రిలయన్స్ శ్రీధర్, జెమినీ కిరణ్ హాజరై టీంకు బెస్ట్ విశేష్ అందించారు.

నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, భాస్కరన్ సినిమాటోగ్రఫీ.. ఈ రెండూ సినిమాలోఆకర్షణగా వుండబోతున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా రష్మిక మాట్లాడుతూ..  ‘రెయిన్‌బో’ కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. దర్శకుడు దర్శకుడు శాంతరూపన్ అద్భుతమైన కథతో వచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. టీం అందరితో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను’’ అన్నారు  

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత..  ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మరో మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. దర్శకుడు శాంతరూపన్ చాలా మంచి కథని రాసుకున్నారు. రష్మిక గారికి కృతజ్ఞతలు. మంచి టెక్నికల్ టీం, సరికొత్త కథాంశంతో రాబోతున్న ‘రెయిన్‌బో’ కూడా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం ” అన్నారు  

దర్శకుడు శాంతరూపన్.. ప్రభు గారు ఒక కథ ఓకే చేస్తే ఎలా వుంటుందో అందరికీ తెలుసు  ‘రెయిన్‌బో’ అంతే అద్భుతంగా వుంటుంది. ఈ కథని అంగీకరించిన రష్మిక గారికి కృతజ్ఞతలు. టీం అంతా ఎంతో సపోర్ట్ చేస్తోంది. మీకు వండర్ ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి శ్రమిస్తున్నాం’’ అన్నారు.

దేవ్ మోహన్  మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు. నా మొదటి సినిమా శాకుంతులం విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా వుంది.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు గారికి థాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినపుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7, 2023 నుండి ప్రారంభమవుతుంది.

తారాగణం: రష్మిక మందన, దేవ్ మోహన్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం
-శాంతరూబన్
డీవోపీ-కె. ఎం. భాస్కరన్
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్ – ఇ. సంగతమిళన్
ప్రొడక్షన్ డిజైనర్- వినీష్ బంగ్లాన్
ఆర్ట్ డైరెక్టర్: సుబెంథర్ పిఎల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగప్రభాకరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

5 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago