అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల

అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల టీమ్ వర్క్ తెలుగులో క్రేజీ కాంబినేషన్‌లో ఒకటిగా మారుతోంది. వీరిద్దరు కలిసి చేసిన మొదటి చిత్రం ‘నాంది’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ ని అందుకొని, వారి రెండవ చిత్రం ‘ఉగ్రం’ పై పాజిటివ్ బజ్‌ని  క్రియేట్ చేసింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ మంచి స్పందన వచ్చింది. నరేష్ సీరియస్ కాప్ రోల్‌లో కనిపించడం క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ సింగిల్ దేవేరికి అద్భుతమైన స్పందన రావడంతో  బ్లాక్‌బస్టర్ నోట్‌లో మ్యూజిక్  ప్రమోషన్‌లను కూడా ప్రారంభించారు.

మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఉగ్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి,  హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.  తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

సిద్ సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు.  ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: అల్లరి నరేష్, మిర్నా

సాంకేతిక విభాగం:
రచన దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
కథ: తూం వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: సిద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago