డబుల్ ఇస్మార్ట్’ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌తో తిరిగి వస్తున్నారు. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.  

సినిమా విడుదలకు  ఇండిపెండెన్స్ డే పెర్ఫెక్ట్ టైమ్. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో హాలీ డే కూడా సినిమాకు కలిసిరానుంది. పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో విభూతి ధరించి కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, కాగడ ని చూడవచ్చు.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.

యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రీక్వెల్‌కి డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ మ్యాడ్ నెస్ తో ఉండబోతుంది. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్  స్టైలిష్, మాస్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు.

రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని డబుల్ స్కిల్స్ తో అదరగొట్టారు. సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్.

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్‌లు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

నటీ నటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

11 hours ago

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…

16 hours ago

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

1 day ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

1 day ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

2 days ago