వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను తగ్గట్టుగా ‘యుఫోరియా’ అంటూ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌తో రాబోతోన్నారు. ఈ చిత్రంలో సమకాలీన అంశాలను చూపించబోతోన్నారు. లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన గ్లింప్స్, ఫ్లై హై అనే సాంగ్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.
ఇక తాజాగా బుధవారం (మే 28) నాడు ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘యుఫోరియా’ చిత్రంలో జయదేవ్ నాయర్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా గౌతమ్ మీనన్ ఇంట్రెస్టింగ్ లుక్‌తో కనిపిస్తున్నారు. అతను ఈ చిత్రంలో కీలకమైన, ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్నాడని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతోంది.
విఘ్నేష్ గవిరెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుండగా.. ప్రముఖ నటి భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగిణి గుణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…