దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా “ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది” పుస్తక అవిష్కరణ

యువ రచయిత గణ రచించిన ‘ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది’ అనే తెలుగు నవల అవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, మెహర్ రమేష్, శివ నిర్వాణ, సాయి రాజేష్ లతో పాటు పలువురు రచయితలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా పుస్తకాన్ని అవిష్కరించారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే పుస్తక శీర్షికను ప్రశంసించారు. నవల టైటిల్ చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇక రచయిత గణ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి మరోన్నో మంచి నవలలు పాఠకులకు అందించాలని కోరారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది నవలను సగం వరకు చదివాను, చాలా ఆసక్తిగా అనిపించింది, మిగితా సగం కూడా త్వరగానే పూర్తి చేస్తాను అన్నారు. ఇది కచ్చితంగా పుస్తక ప్రియులకు ఎంతో చేరువయ్యే నవలా అన్నారు. ఇలాంటి రచనలు నేటి సమాజానికి ఎంతో అవసరం అని కూడా మాట్లాడారు. ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్ తన అనుభూతిని పంచుకుంటూ.. “ఈ పుస్తకంలో ప్రేమ చెప్పుతో కాదు… చెబుతూ కొట్టింది” అంటూ నవలలోని భావాన్ని వినోదాత్మకంగా వివరించారు. ఇది కచ్చితంగా అందరికి నచ్చుతుందని అభిప్రాయ పడ్డారు.

నవల రచయిత గణ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వీరందరి రాకతో నిండుదనం వచ్చిందని, ఈ నవలలో అన్ని రకాల భావోధ్వేగాలు ఉన్నాయన్నారు. యువతకు మాత్రమే కాదు అన్ని వయుసుల వారిని కట్టిపడేసే విషయం ఉన్న ఈ నవల అమెజాన్‌లో అందుబాటులో ఉందని చెప్పారు. అలాగే గణ రచించిన మరో పుస్తకం ద రియల్ యోగి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేపథ్యంలో రాసిన ఈ ద రియల్ యోగి పుస్తకానికి కూడా చాలా మంచి ఆదరణ వచ్చిందని ఆ పుస్తకం కూడా అమోజాన్ లో అందుబాటులో ఉందని చెప్పారు.

Tfja Team

Recent Posts

తెలంగాణ నుండి 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులను ఒకే తాటిపైకి తెచ్చిన ఈశా గ్రామోత్సవం; ఎల్బీ స్టేడియంలో స్టేట్ ఫైనల్ నిర్వహణ

ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 - తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా…

2 hours ago

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం.

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్…

2 hours ago

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే…

3 hours ago

పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన…

3 hours ago

ప్రముఖ దర్శకుడు క్రిష్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన” ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః ’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఆస్కార్ అవార్డు…

5 hours ago

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “డెలులు”. యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న “డెలులు” అనే పదాన్ని టైటిల్‌గా…

6 hours ago