ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన హీరోయిన్ ”డింపుల్ హయాతి”

Must Read

ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన హీరోయిన్ డింపుల్ హయాతి … జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

హీరోయిన్ డింపుల్ హయతి పై కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కారును ఢీ కొన్నదని జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు బాధితులు.

ఢీ కొనటమే కాక కాసేపు వీరంగం చేసిందంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

డింపుల్ హయాతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్, హుడా ఎన్‌క్లేవ్, జర్నలిస్ట్ కాలనీలో ఈ ఘటన జరిగింది.

డింపుల్ హయాతీని సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు పిలిచారు. అనంతరం ఆమె తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు.

దర్యాప్తు చేపట్టి తదుపరి విషయాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, డింపుల్ ఖిలాడి, రామబాణం సినిమా లో నటించి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను నిర్మించుకుంది. తాజాగా, జరిగిన పరిణామాలతో తన కెరీర్ పై ప్రభావం పడవచ్చని సిని వర్గాలు చెబుతున్నాయి.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News