శ్రద్ధాదాస్ , అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ట్యాగ్ లైన్. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్ నిర్మాత గా, శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ లు సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.
విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ బడ్జెట్‌తో ఫాంటసీ, హారర్ జోనర్ మూవీగా కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కుమారి ఖండాన్ని పరిచయం చేస్తూనే మూల కథకు పురాణ నేపథ్యంతో పాటు నూతన హంగులను అద్దుతూ టీమ్ సినిమాను ఆవిష్కరించింది. దేవి చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంతో ప్రధాన పాత్ర దారుడుగా మీ ముందుకు వస్తున్నారు. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ సినిమాను దర్శకుడు మణి తెల్లగూటి అండ్ టీమ్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని విశేషాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
శ్రద్ధాదాస్ , అజయ్, మాస్టర్ మహేంద్రన్ , సాహితి ఆవంచ, తనికెళ్ళభరణి, ఆమని,
అర్జున్ అంబటి, ఐశ్వర్య, సాయి దీన, రవి వర్మ, రోహిణి, యాదంరాజు, దేవిప్రసాద్, నంద దురసిరాజ్,వాసువిక్రం, దయానంద్, ఛత్రపతి శేఖర్, అంబటి అర్జున్, హేమంత్, షిఫ్ వెంకట్, శ్రీసుధ, జీవా, సూర్య, ఈటీవీ ప్రభాకర్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: రిత్విక్ సిద్ధార్థ్, బ్యానర్: మినర్వా పిక్చర్స్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, దర్శకత్వం: మణి తెల్లగూటి, కో ప్రొడ్యూసర్స్: శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్, సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా, మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్,
బ్యాక్గ్రౌండ్ స్కోర్ : షాజిత్ హుమయూన్, యాక్షన్: శంకర్, నందు, అంజి, డైమండ్ రత్నం, కొరియోగ్రఫీ: సుచిత్రా చంద్రబోస్, మొయిన్, లిరిక్స్: రాకేందు మౌళి, కడలి, వివేక్ వేల్ మురుగన్, సింగర్స్: చిత్ర, సునీత, అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్, రాహుల్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర, ఫణి (బియాండ్ మీడియా).
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…