హైదరాబాద్:
మలికిరెడ్డి వీర్ డైనమిక్ అడ్వకేట్ పాత్రలో, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రవి గోగుల దర్శకత్వంలో, సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్‌లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ‘లీగల్లీ వీర్’ చిత్ర యూనిట్ సభ్యులను ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు అభినందించారు. ‘లీగల్లీ వీర్’ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సార్లు రుజువు అయిందన్నారు.
ఈ సందర్భంగా హీరో మలికిరెడ్డి వీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలన్న తపనతో ‘లీగల్లీ వీర్’ చేశాం. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా నచ్చడం ఎంతో సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు కూడా మా ‘లీగల్లీ వీర్’ సినిమాను అభినందించడం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.’’ అని అన్నారు.
దర్శకుడు రవి మాట్లాడుతూ..‘‘సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు ‘లీగల్లీ వీర్’ సినిమాను అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. డిసెంబర్ 27న విడుదలైన మా సినిమాను చూసి హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు’’ అని చెప్పారు.
సాంకేతిక బృందం:
బ్యానర్: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
నిర్మాతలు: మల్కిరెడ్డి శాంతమ్మ
సంభాషణలు – స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి గోగుల
సంగీతం: శంకర్ తమిరి
సినిమాటోగ్రాఫర్: జాక్సన్ జాన్సన్, అనూష్ గోరక్
ఎడిటర్: S.B. ఉద్ధవ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చైతన్య
కొరియోగ్రాఫర్‌లు: ప్రేమ రక్షిత్ మాస్టర్, వల్లం కళాధర్
లిరిసిస్ట్: వీరించి శ్యామ్ కాసర్ల, రొల్ రైడా, భ్రద్వాజ్ గాలి
ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ
VFX: మ్యాజిక్ B
ఫైట్స్: రామకృష్ణ
కలరిస్ట్ – పంకజ్
DI & సౌండ్ మిక్సింగ్: శ్రీ సారధి స్టూడియోస్,
సౌండ్ డిజైన్: రాజు,
పీఆర్వోలు: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.
The movie Barbarik, produced by Vijaypal Reddy Adidhala under the banner of Vaanara Celluloid and…
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర…
The much-anticipated third song from Daaku Maharaaj, titled "Dabidi Dibidi," is here and setting social…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి…
మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "1000…
The movie "1000 Crores," starring Mohanlal, is being produced by Kasula Ramakrishna (Sridhar), and Srikar…