“ధూం ధాం” సినిమాలో ఉండేదంతా ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్చే తన్ కృష్ణ

Must Read

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో పాటలన్నీ రాసే అవకాశం దక్కింది. నాలుగు పాటలు బాగా కుదిరాక ఐదో పాట కూడా సక్సెస్ చేయాలని మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా పాట రాశా. ఆ పాట మంగ్లీ పాడటమే కాదు పాటలో కనిపించింది. ఈ సినిమాలో పాటలు రాయడంతో పాటు ఓ క్యారెక్టర్ లో నటించాను. సెకండ్ హీరోయిన్ ఫాదర్ రోల్ చేశాను. బిజినెస్ మేన్ పాత్ర ఇది. “ధూం ధాం” సినిమా మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి, డైరెక్టర్ సాయికిషోర్ కు, హీరో చేతన్ తో పాటు టీమ్ అందరికీ పెద్ద విజయాన్ని ఇవ్వాలి. అన్నారు.

డైలాగ్ రైటర్ ప్రవీణ్ వర్మ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో ఎంటర్ టైనింగ్ గా డైలాగ్స్ ఉంటాయి. మా టీమ్ అంతా ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేశాం. హీరో చేతన్ ప్యాషనేట్, హీరోయిన్ హెబ్బా బబ్లీ గర్ల్. వీళ్ల క్యారెక్టర్స్ కాంట్రాస్ట్ గా ఉన్నా..సినిమాలో బాగా కుదిరాయి. ఈ నెల 8న మీరంతా “ధూం ధాం” చూసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్ారు.

నటుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ – ప్రేక్షకులకు వినోదాన్ని అందించి వారి బాధలను తగ్గించే ప్రతి దర్శకుడూ గొప్పవాడే. మా సాయి కిషోర్ అలాంటి దర్శకుల సరసన ఈ చిత్రంతో చేరబోతున్నాడు. మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే ప్లెజెంట్ సినిమాలు తప్పకుండా బాగుంటాయి. “ధూం ధాం” సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు కారణం. ఆయన ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా ఫ్రెండ్ గోపీమోహన్ ఈ సినిమాకు నిత్యం వెన్నంటే ఉన్నారు. గోపీ సుందర్ గారి మ్యూజిక్, రామజోగయ్య గారి లిరిక్స్ మా మూవీకి ఆకర్షణగా నిలుస్తాయి. సెకండాఫ్ లోని కామెడీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

ప్రొడ్యూసర్ రామ్ కుమార్ మాట్లాడుతూ – నాకు సినిమాలంటే ఇష్టం. గౌరవం. అయితే నేను నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. మా చేతన్ చదువులు పూర్తయ్యాక సినిమాల్లో చేస్తానని తన ప్యాషన్ నాకు చెప్పాడు. అలా తనను హీరోగా పెట్టి మూవీస్ చేశాం. ఈ జర్నీలో “ధూం ధాం” చాలా స్పెషల్ మూవీగా నిర్మించాం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. చిన్న సినిమాకు బడ్జెట్ ఎంత ఆదా చేస్తే అంత మంచిది. మేము ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ వాళ్లు సినిమా చూసి పంపిణీ చేస్తున్నారు. మంచి థియేటర్స్ దొరికాయి. ఈ నెల 8న ప్రేక్షక దేవుళ్లు ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నాం. అన్నారు.

రైటర్ గోపీ మోహన్ మాట్లాడుతూ – ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “ధూం ధాం” సినిమాను చేశాం. ముఖ్యంగా నేను సెకండాఫ్ మీద డిపెండ్ అయ్యాను. సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. మేము ప్రీమియర్స్ వేసినప్పుడు కూడా సెకండాఫ్ కు ఆడియెన్స్ బాగా నవ్వుకున్నారు. వెన్నెల కిషోర్ హీరో కజిన్ క్యారెక్టర్ చేశారు. సెకండాఫ్ నుంచి సినిమా మొత్తం ఆయన ఉంటారు. గిరి, బెనర్జీ, సాయి శ్రీనివాస్ క్యారెక్టర్స్ కూడా నవ్వించేలా ఉంటాయి. ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ వల్లే ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్ చేయగలుగుతున్నాను. అన్నారు.

హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా రిలీజ్ కు వచ్చేస్తోంది. మా టీమ్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. సినిమా ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫస్టాఫ్ పాటలు, లవ్ స్టోరీతో సరదాగా వెళ్తుంది. సెకండాఫ్ కు వచ్చేప్పటికి గంట సేపు పెళ్లి ఇంట్లో హిలేరియస్ కామెడీ ఉంటుంది. ఈ మూవీకి హీరోగా నా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించా. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ కోసం స్టార్స్ కు పనిచేసిన స్టైలిస్ట్స్ వర్క్ చేశారు. నేను ఇంతకుముందు చేసిన గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి చిత్రాల్లో ఒక కమర్షియల్ లుక్ లో కనిపించలేదు. ఈ చిత్రానికి అలా కనిపించేందుకు ట్రై చేశా. మేము టీజర్ లో చూపించినట్లు “ధూం ధాం” సినిమాలో కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ అందరికీ దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 8న థియేటర్స్ లో మా “ధూం ధాం” చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా

Latest News

Hakku initiative Mana Hakku Hyderabad curtain raiser song launched

Hakku Initiative, a social awareness campaign in partnership with the public and the government, launched the 'Hyderabad Curtain Raiser'...

More News