టాలీవుడ్

‘వార్ 2’ కోసం ‘కజ్రా రే’, ‘ధూమ్ 3’ మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

  • ప్రీ రిలీజ్‌ గ్లింప్స్‌తో వెండి తెరపై హృతిక్, ఎన్టీఆర్ డాన్సింగ్ మ్యాజిక్‌ హైప్‌ను మరింతగా పెంచే ఆలోచనలో మేకర్స్

ఆదిత్య చోప్రా గత ముప్పై ఏళ్లుగా ఇండియన్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన, విప్లవాత్మకమైన ఆలోచనలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ఎన్నో భారీ చిత్రాలను అందించారు. తాజాగా ‘వార్ 2’ కోసం ఆయన తన కజ్రా రే, ధూమ్ 3 రేంజ్‌లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. యశ్ రాజ్ ఫిల్ నిర్మించిన ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్ చూసేందుకు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు, సినీ లవర్స్ అంతా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 నుంచి హృతిక్, ఎన్టీఆర్ డాన్సింగ్ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను ఈ వారంలో విడుదల చేస్తున్నారు. ఇలా గ్లింప్స్‌ను విడుదల చేయటానికి గల కారణం.. ఇద్దరు మేటి డాన్సర్ చేసే డాన్సింగ్ మ్యాజిక్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఓ అనిర్విచనీయమైన అనుభూతిని పొందాలనేదే ఆలోచన.

‘ఈ ఏడాదిలోనే అత్యంత భారీ హైప్ వచ్చిన, క్రేజ్ దక్కిన చిత్రంగా ‘వార్ 2’ నిలిచింది. ‘వార్ 2’ నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ అందరినీ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్ నంబర్ పైనే ఉంది. ఈ విషయం నిర్మాత ఆదిత్య చోప్రాకు తెలుసు. విడుదల వరకు ఈ పాట కోసం హైప్‌ను పెంచేలా మేకర్లు ప్లానింగ్ చేస్తున్నారు. ఈ పాటను ఉచితంగా చూపించాలని ఆదిత్య చోప్రా అనుకోవడం లేదు. ‘వార్ 2’ని బిగ్ స్క్రీన్‌లో చూసినప్పుడు, ఒకేసారి ఎన్టీఆర్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేసే ఘట్టాన్ని చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు’ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

“ఇది క్లాసిక్ ఆదిత్య చోప్రా గొప్ప స్ట్రాటజీ. ఇప్పటి వరకు ‘బంటీ ఔర్ బబ్’, కజ్రా రే వంటి పాటలను నేరుగా తెరపైనే చూపించారు. పైగా ‘ధూమ్ 3’ పాటలన్నీ నేరుగా సిల్వర్ స్క్రీన్‌పైనే చూపించారు. ముఖ్యంగా కంమ్లీ పాటను థియేటర్‌లో చూసిన వావ్ అనుకున్నారు. ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎన్టీఆర్-హృతిక్ డ్యాన్స్ సాంగ్‌ను కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేయకుండా నేరుగా థియేటర్లో చూసి ఆడియెన్స్ ఎక్స్‌పీరియెన్స్మే చేయాలనేది ఆదిత్య చోప్రా ప్లాన్. ఆయన ప్రాధాన్యతంతా థియేటర్స్‌కు వచ్చే ఆడియెన్స్, టికెట్ సేల్స్ పైనే ఉంది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న ‘వార్ 2’లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

8 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago