ధనుష్, శేఖర్ కమ్ముల #D51 అనౌన్స్ మెంట్

Must Read

ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ #D51 అనౌన్స్ మెంట్

ధనుష్ 51వ చిత్రం లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యుటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేతులు కలపనున్నారు.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లోని క్రేజీ చిత్రం #D51ని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీర్వాదంతో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మల్టీ లాంగ్వేజస్(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) లో భారీ స్థాయిలో రూపొందించనున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ధనుష్ పుట్టినరోజు (జులై 28) సందర్భంగా మేకర్స్ #D51 కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: ధనుష్
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
పీఆర్వో : వంశీ శేఖర్
డిజిటల్ : ఫస్ట్ షో

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News