హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ టీజర్ రిలీజ్, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ విడుదలకు వస్తున్న సినిమా

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. “దీవాన” సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు “దీవాన” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమా ఫీల్ కలుగుతోంది. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ఓ పెళ్లి వేడుకల్లో హీరోయిన్ ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుంటాడు. ఆ అమ్మాయి తరుపు వాళ్లతో ప్రమాదమని స్నేహితులు చెప్పినా వినిపించుకోడు. ఇంతే ప్రేమ అమ్మాయి నుంచి కూడా ఈ అబ్బాయికి దక్కిందా లేదా అనేది థియేటర్స్ చూడాలి. టీజర్ లోని ‘ప్రేమ ఇది ప్రేమ గుండెల్లోన సడిరేపేదే ప్రేమ…’ సాంగ్ బీజీఎం హార్ట్ టచింగ్ గా ఉంది. టీజర్ చివరలో ‘ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్ర ఈ పోరీలు, అది నీ పానం పీక్కతినకపోతే నన్ను అడుగురా..’ అనే డైలాగ్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. “దీవాన” సినిమాలో ఒక ఇంటెన్స్ బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ చూడబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. టీజర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. టీజర్ పూర్తయ్యాక కూడా పాట ఇంకా మదిలోనే తిరుగుతున్న అనుభూతి కలుగుతోంది. విజువల్స్ చాలా రియలెస్టిక్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ జంట ఫ్రెష్ గా కనిపిస్తోంది. కొత్త హీరోయిన్ స్మేహ మణిమేగలై బ్యూటిఫుల్ గా కనిపించి ఆకట్టుకుంది.

నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago