‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి బిగ్గెస్ట్ మాస్‌బస్టర్ ‘కాలరే ఎత్తరా’ విడుదల

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి.

ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో ఈ గీతావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది.

‘కాలరే ఎత్తరా’ పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్‌లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎనర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో తెరపై వెలుగులు నింపారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, రామ్ మిర్యాల ఉత్సాహభరితమైన గానం, కాసర్ల శ్యామ్ శక్తివంతమైన సాహిత్యం కలిసి.. సినిమా యొక్క మాస్ అప్పీల్‌ను ప్రతిబింబించేలా గొప్పగా ఉంది ఈ గీతం.

‘కాలరే ఎత్తరా’ గీతావిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకరించిన రాశి ఖన్నాకు ముందుగా కృతఙ్ఞతలు. ఈ పాటలో కూడా కళ్యాణ్ గారితో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు రాశి. 1500-2000 మందితో భారీస్థాయిలో ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్ గారు వేసిన డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాని ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే.. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో ఆయన అద్భుతంగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కెరీర్ లోనే భారీ సెట్ ను ఈ పాట కోసం వేశారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం.” అన్నారు

నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ..ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ గారితో గుర్తుండిపోయే చిత్రం చేయాలని అందరూ కోరుకుంటారు. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం న భూతో న భవిష్యతి. ప్రజా సేవలో తీరిక లేకుండా ఉండి కూడా.. ఈ సినిమా పట్ల ఆయన చూపిన అంకితభావానికి హ్యాట్సాఫ్. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అభిమానులకు మేము ఒక హామీ ఇవ్వగలను. ఖుషి నాటి రోజులను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం ఎంజాయ్ చేసేలా అన్ని అంశాలతో ఈ సినిమాను హరీష్ శంకర్ గొప్పగా తెరకెక్కించారు.” అన్నారు.

కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. “మీ అందరి ఉత్సాహం చూస్తుంటే పాట ఎంతగానో నచ్చిందని అర్థమవుతోంది. నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు ఒకే ఒక్క కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మాస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “అభిమానుల ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఈ పాట నచ్చింది అనుకుంటున్నాను. భీమ్లా నాయక్ లో రెండు మంచి పాటలు రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి డ్యాన్స్ నెంబర్ రాయలేదనే వెలితి ఉండేది. ‘కాలరే ఎత్తరా’తో ఆ వెలితి తీరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం అదిరిపోయింది. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇలాంటి అత్యద్భుతమైన పాటను రచించే అవకాశమిచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి కృతఙ్ఞతలు. ఈ ఉగాది పండుగను ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరింత ఉత్సాహంగా జరుపుకుందాం.” అన్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. మాస్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని అంశాలతో కూడిన ఒక మంచి చిత్రాన్ని రూపొందించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం విశేషం.

మార్చి 14వ తేదీన ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్రబృందం. అనంతరం మార్చి 15వ తేదీన భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులకు మరపురాని సినీ అనుభూతిని అందించేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను అత్యంత శ్రద్ధతో గొప్పగా మలుస్తున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

TFJA

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

55 minutes ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

1 hour ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago