ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ ఏడాది కూడా ఆయన 79వ జయంతిని పురస్కరించుకొని “దాసరి లెజెండరీ అవార్డ్స్” పేరిట అవార్డ్స్ ఫంక్షన్ అత్యంత ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ నటులు – మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్, సీనియర్ నటీమణి రోజారమణి, సీనియర్ హీరో సుమన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి కామేశ్వరి, వంశీ రామరాజు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు!!

2025 -26 సంవత్సరాలలో టాలీవుడ్ లో వివిధ శాఖలలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులకు ఈ వేడుకలో పట్టం కట్టారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, సీనియర్ దర్శకులు పి.ఎన్. రామచంద్రరావు, మెగా డాటర్ సుస్మిత కొణిదల, సాహు గారపాటి, ప్రముఖ నటి లయ, ప్రముఖ దర్శకులు గుణశేఖర్, ప్రముఖ నటుడు శివాజీ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ త్రయం “నాగభైరు సుబ్బారావు – ప్రదీప్ -ఓం ప్రకాష్ నారాయణ”, ప్రముఖ రచయిత భారతిబాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, “రాకాస” దర్శకురాలు మానస శర్మ తదితరులు ఉన్నారు!!

