విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల

Must Read

విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో ‘బిచ్చగాడు’ తరువాత ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌తో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి.

ఇక తాజాగా ‘వంద దేవుళ్ళు’ నుంచి ‘అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు. వంద దేవుళ్లే దిగివచ్చినా అని భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు ‘అమ్మ అమ్మేగా’ అని అందరినీ మెప్పించేందుకు వచ్చారు. ‘అమ్మ అమ్మేగా’ అనే ఈ పాటకి భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ బాణీ, శ్రీకాంత్ హరిహరణ్ గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ పాటను వింటే అమ్మ విలువ ఏంటో మరోసారి అర్థం అయ్యేలా ఉంది.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ : ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత : రామంజనేయులు జవ్వాజి
దర్శకుడు : శశి
సంగీతం : బాలాజీ శ్రీరామ్
డీఓపీ : ఎస్. బి. దర్శన్ కిర్లోష్
ఎడిటర్ : హరిష్ యువరాజ్
మాటలు : భాష్య శ్రీ
పీఆర్వో : సాయి సతీష్

Latest News

అత్యంత వైభవంగాదాసరి లెజెండ్రీ అవార్డ్స్

ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ ఏడాది...

More News