నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా, హాయ్ నాన్న సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి. హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయ్యింది, కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా చాలా ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు నాని దసరా, హాయ్ నాన్న SIIMA, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో రికార్డ్ నామినేషన్‌లను పొందాయి. హాయ్ నాన్న 10 SIIMA అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ కాగా, దసరాకు SIIMAలో 11 నామినేషన్లు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 8 నామినేషన్లు వచ్చాయి.
నాని అందించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా డెబ్యు చేసిన చిత్రం దసరా. ఇక, హాయ్ నాన్నతో దర్శకుడిగా డెబ్యు చేసిన శౌర్యువ్ కూడా హిట్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఇద్దరూ ఉత్తమ దర్శకుల విభాగంలో నామినేట్ అయ్యారు.
స్క్రిప్ట్‌లు, డెబ్యూ డైరెక్టర్లపై నమ్మకాన్ని ఉంచినందుకు నాని ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించారు.
దసరాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తే, హాయ్ నాన్నాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా నామినేట్ అయ్యారు.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మేజర్ అవార్డుల్లో ఇన్ని నామినేషన్లు అందుకోవడం నాని గ్రేట్ అచీవ్మెంట్.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…