వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అరుదైన ఘనత సాధించారు. ఒకేఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులుని అందుకున్నారు. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో విరాట పర్వం, గార్గి చిత్రాలలో తన నటనకు గానూ ఉత్తమ నటి అవార్డ్ విజేతగా నిలిచారు. దీంతో సాయి పల్లవి కెరీర్ లో గెలుచుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డులు సంఖ్య ఆరుకి చేరింది. ఈ సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ “తండేల్” టీం సాయి పల్లివి ని సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తో పాటు చిత్ర యూనిట్ ఆమెను అభినందిస్తూ సెట్స్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ “తండేల్”. మ్యాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది.
నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామరస్ అవతార్‌లలో కనిపిస్తారు.
దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాంతీయ యాస ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…