తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలి కలిసిన కోస్టా రిక అధికార ప్రతినిధి శ్రీమతి సోఫియా సలాస్

Must Read

కోస్టా రిక దేశ అధికార ప్రతినిధి శ్రీమతి సోఫియా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ దాము గారిని మరియు నిర్మాతల మండలి సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారిని మరియు ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు గారు రామ్ సత్యనారాయణ గారిని కలిసి కోస్తారిక దేశంలో షూటింగులకు గల అవకాశాలని వివరించారు మరియు అనుమతులు అన్ని సింగిల్ విండో విధానంలో ఇస్తామని పన్ను రాయితీలు కల్పిస్తామని తెలియ చేసారు.

నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలియచేశారు. పలువురు నిర్మాతలు పాల్గొని సోఫియా గారితో సందేహాలు నివృత్తి చేసుకొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలి తరపున మరియు ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు గారు రామ్ సత్యనారాయణ గారు శ్రీమతి సోఫియా గారిని సన్మానించారు. ఫ్యూజీ సాఫ్ట్వేర్ మనోహర్ రెడ్డి గారు, పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోఫియా సలాస్ అంతర్జాతీయ సహకారంలో తగినంత అనుభవం ఉన్న కోస్టా రికన్ న్యాయవాది. ఆమె
యూనివర్శిటీ ఆఫ్ కోస్టా రిక నుండి లా డిగ్రీని మరియు యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ (UK) నుండి మానవ హక్కుల ఇంటర్ డిసిప్లినరీ మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. సహాయం మరియు రక్షణతో సహా అనేక రకాల సమస్యలపై అంతర్జాతీయ UN సంస్థలతో
హానికర పరిస్థితుల్లో వలసదారులు మరియు పురోగతిని వేగవంతం చేయడానికి దేశాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) సాధన దిశగా 10 సంవత్సరాలకు పైగా స్థానికంగా మరియు అంతర్జాతీయంగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల, మంత్రిత్వ శాఖతో కోస్టారికా రాయబార కార్యాలయంలో మంత్రి సలహాదారుగా మరియు కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. అక్టోబర్ 2021లో భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని కోస్టారికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మరియు కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా సోఫియా సలాస్ మాట్లాడుతూ : తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దాము గారిని మరియు తెలుగు ఫిలిం నిర్మాతలు మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ గారిని మరియు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు గారు, రామ్ సత్యనారాయణ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మోహన్ ముళ్ళపూడి గారితో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహకరిస్తున్న మోహన్ ముళ్ళపూడి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉన్నదేశాలన్నిటిలో మా దేశం కూడా చాలా అందమైనది. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకి పర్మిషన్లు ఇస్తాము. నిర్మాతలు కోస్టా రిక దేశంలో షూటింగ్ చేయాలనుకునేవారు తెలుగు ఫిలిం ఛాంబర్ వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అని తెలియజేశారు.

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News