డెర్మటాలజీ అండ్ కాస్మటాలజీ పట్ల అవగాహన పెరుగుతున్న తరుణంలో అందుకు అవసరమైన అత్యాధునిక వసతులతో క్లినిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో కె.బి.ఆర్. పార్క్ రోడ్డులో “ఆస్ట్రిడ్ డెర్మటాలజీ అండ్ కాస్మోటాలజీ క్లినిక్” పేరుతో ఒక అల్ట్రా మోడ్రన్ క్లినిక్ ప్రారంభమైంది.
ఈ క్లినిక్ లో మూడు అత్యాధునిక పరికరాలను సుప్రసిద్ధ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ప్రాక్టీసింగ్ డెర్మటాలజిస్ట్ గా పది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన “డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ” నిర్వహిస్తున్న ఈ క్లినిక్ లో పిగ్మెంటేషన్ కోసం’క్యూ స్విచ్ ‘, ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం’ హై వ్యూ ‘..స్కార్ ట్రీట్మెంట్ కోసం ఎం.ఎన్.ఆర్. ఎఫ్ .
అనే మూడు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ ను అల్లు అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ” డెర్మటాలజీ కాస్మటాలజీ ట్రీట్మెంట్ లో పదేళ్ల అనుభవం కలిగిన డాక్టర్ అలేఖ్య నాకు సొంత బిడ్డ లాంటిది. ఆమె మామగారు సీనియర్ యాక్టర్ అయిన భాస్కర్ రావు గారు నాకు చిరకాల మిత్రులు .
ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది . బంజారాహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఇలాంటి వెల్ ఎక్విప్డ్ క్లినిక్ ను ప్రారంభించిన డాక్టర్ అలేఖ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా హెల్త్ అండ్ కాస్మటాలజీ అవేర్నెస్ కలిగిన మా సినిమా వాళ్లకు ఈ క్లినిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వయసు మీద పడే కొద్దీ ముఖంలో ముడతలు కనిపించకూడదు అనుకునే నాలాంటి వాళ్లకు ఇక్కడ మంచి ఏజింగ్ ట్రీట్మెంట్ లభిస్తుంది ” అని చమత్కరించారు . ఈ సందర్భంగా డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నిర్మాతగా, పరిశ్రమ ప్రముఖునిగా వెలుగొందుతున్న అల్లు అరవింద్ గారి లాంటి గొప్ప వ్యక్తి చేతులమీదుగా ఈ ఆవిష్కరణ జరగటం చాలా ఆనందంగా ఉంది.
వారికి మా కుటుంబ సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…