56వ ఇఫీలో ఉత్త‌మ తొలి చిత్ర ద‌ర్శ‌కుడిగా క‌మిటీ కుర్రాళ్లు డైర‌క్ట‌ర్ య‌దు వంశీ నామినేట్‌

Must Read

క‌మిటీ కుర్రాళ్లు సంద‌డి కంటిన్యూ అవుతూనే ఉంది. 56వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ఉత్త‌మ తొలి చిత్ర దర్శ‌కుడిగా య‌దువంశీ నామినేట్ అయ్యారు. ఈ ప్రెస్టీజియ‌స్ నామినేష‌న్ ద‌క్క‌డంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది క‌మిటీ కుర్రాళ్లు టీమ్‌.

మ‌న సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను, మ‌న విలువ‌ల‌ను, మ‌న‌స్త‌త్వాల‌ను అద్దం ప‌ట్టే కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌కు క‌న్విన్స్ చేసిన ద‌ర్శ‌కుల‌కు ఇఫి నామినేష‌న్ విభాగంలో చోటు ద‌క్కుతుంది. తొలి చిత్రంతోనే ఇంత‌టి గుర్తింపు తెచ్చుకోవ‌డం మామూలు విష‌యం కాదు. యావ‌త్ దేశం గ‌ర్వించే ఈ విభాగంలో చోటు సంపాదించుకున్నందుకు తొలి చిత్ర ద‌ర్శ‌కుడిగా య‌దువంశీ, క‌మిటీ కుర్రాళ్లు టీమ్ ఆనందానికి అవ‌ధుల్లేవు.
ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో క‌మిటీ కుర్రాళ్లు మూవీకి మంచి గుర్తింపు ల‌భించింది. 2024 గ‌ద్ద‌ర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో జాతీయ స‌మైక్య‌త‌కు కృషి చేసిన చిత్రంగా క‌మిటీ కుర్రాళ్లు ఉత్త‌మ చిత్రంగా అవార్డు అందుకుంది. ఉత్త‌మ డైర‌క్ట‌ర్‌గా య‌దువంశీకి పుర‌స్కారం ద‌క్కింది. దుబాయ్‌లో జ‌రిగిన 2025 గ‌ల్ఫ్ అకాడ‌మీ మూవీ అవార్డ్స్ (గామా)లోనూ ఢంకా భ‌జాయించింది క‌మిటీ కుర్రాళ్లు. ఉత్త‌మ తొలి చిత్ర నిర్మాత‌గా నీహారిక కొణిదెల అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా య‌దువంశీని కూడా పురస్కారం వ‌రించింది.
2025 సైమా అవార్డుల్లోనూ ఉత్త‌మ తొలి చిత్ర తెలుగు నిర్మాత‌గా నీహారిక కొణిదెల, ఉత్త‌మ తొలి చిత్ర తెలుగు న‌టుడిగా సందీప్ స‌రోజ్ అవార్డుల‌ను అందుకున్నారు.
ప‌ద్మ‌జ కొణిదెల‌, జ‌య‌ల‌క్ష్మి అడ‌పాక నిర్మించిన సినిమా ఇది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్, శ్రీ రాధా దామోద‌ర్ స్టూడియోస్ ప‌తాకాల‌పై తెర‌కెక్కింది. నీహారిక కొణిదెల స‌మ‌ర్పించారు. నీహారిక తొలి చ‌ల‌న‌చిత్ర స‌మ‌ర్ప‌ణ ఇది. ఇప్ప‌టికీ ప‌లు చోట్ల క‌నిపించే సామాజిక అస‌మాన‌త‌లకు దివిటీ ప‌ట్టిన చిత్ర‌మిది.

గోదావ‌రి ప‌రిస‌రాల్లోని అందాల‌ను ఎదురోలు రాజు త‌న కెమెరాలో బంధించిన తీరు మెప్పించింది. అనుదీప్ దేవ్‌ సంగీతం అందించారు. త‌న సంగీతంలోని ప్ర‌తి స్వ‌రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను తాకింది.

ఆంధ్రాలోని ఓ చిన్న ప‌ల్లెటూరిలోని క‌మిటీ కుర్రోళ్ల మ‌ధ్య జ‌రిగిన ప‌లు అంశాల‌కు సంబంధించిన క‌థ మూవీ ల‌వ‌ర్స్ ని మెప్పించింది. సందీప్ స‌రోజ్‌, త్రినాథ్ వ‌ర్మ‌, పి.సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, రాధ్య‌, ప్ర‌సాద్ బెహ‌ర‌, మ‌ణికంఠ ప‌ర‌సు, లోకేష్ కుమార్ ప‌రిమి, యశ్వంత్ పెండ్యాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇప్ప‌టిదాకా పొందిన గుర్తింపు:

* గ‌ద్ద‌ర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 – నేష‌న‌ల్ ఇంటిగ్రేష‌న్‌, క‌మ్యున‌ల్ హార్మ‌నీ అండ్ సోష‌ల్ అప్‌లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్‌: ఉత్త‌మ తొలి చిత్ర ద‌ర్శ‌కుడు (య‌దు వంశీ)
* గామా 2025 (దుబాయ్‌) – ఉత్త‌మ తొలి చిత్ర నిర్మాత (నీహారిక కొణిదెల‌) : ఉత్త‌మ తొలి చిత్ర ద‌ర్శ‌కుడు (య‌దు వంశీ)
* సైమా 2025 – ఉత్త‌మ తొలి చిత్ర నిర్మాత (తెలుగు) (నీహారిక కొణిదెల‌): ఉత్త‌మ తొలి చిత్ర న‌టుడు (తెలుగు) (సందీప్ స‌రోజ్‌)
* ఇఫి 2025 (గోవా) – నామిని:  ఉత్త‌మ తొలి చిత్ర భార‌త చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుడు

య‌దువంశీకి, ఇఫి నామినేష‌న్ కేవ‌లం గుర్తింపు మాత్ర‌మే కాదు. త‌న ఇన్నేళ్ల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం. అంతకు మించి త‌న‌లోని ఆలోచ‌న‌కు, సున్నిత‌త్వానికి ప్ర‌తీక‌. క‌మిటీ కుర్రోళ్లు సినిమాకు జాతీయంగా, అంత‌ర్జాతీయంగా అందుతున్న ప్ర‌శంస‌లు నీహారిక కొణిదెల‌లో కంటెంట్ డ్రైవ‌న్ సినిమాలు చేయ‌డానికి మ‌రింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఫ్రెండ్‌షిప్‌, ఐక్య‌త‌, సామాజిక స్పృహ‌తో గోదావ‌రి తీరం నుంచి గ్లోబ‌ల్ స్టేజ్‌కి చేరుకున్న క‌మిటీ కుర్రోళ్లను చూసి ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది టీమ్‌.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News