డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న “డైరెక్టర్ సాబ్”

Must Read

హార్తీక్ ప్రొడక్షన్స్ పతాకంపై రమణ భార్గవ, పింగ్ పాంగ్ సూర్య, రిమ్‌జిమ్ శర్మ, జోగి బ్రదర్స్ (జోగి నాయుడు, కృష్ణంరాజు) అశోక్ కుమార్, చిన్నా, చిత్రం శీను నటీ నటులుగా హార్తీక్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం
“డైరెక్టర్ సాబ్”. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి నటుడు అశోక్ కుమార్, తోటపల్లి సాయినాథ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని డైరెక్టర్ సాబ్” మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం

ప్రముఖ రచయిత తోటపల్లి సాయినాథ్ మాట్లాడుతూ… దర్శకులు రాజమౌళి గారు తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చి కొత్త దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాగే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న డైరెక్టర్ సాబ్ టీజర్ చాలా డిఫరెంట్ గా కొత్త ధనం గా చాలా బాగుంది.త్వరలో వస్తున్న ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ..సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న దర్శకుడు హార్తీక్, సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త దనం చూయించాలనే తపన తనలో కనపడింది. ఇప్పుడు విడుదల చేసిన “డైరెక్టర్ సాబ్”చిత్ర మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. చూడగానే మంచి పాజిటివ్ వైబ్స్ కలిగేలా చాలా బాగుంది.
రొటీన్ కు భిన్నంగా చెప్పిన కథలన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు డిఫరెంట్ కథతో వస్తున్న ఈ డైరెక్టర్ సాబ్ కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత హార్తీక్ మాట్లాడుతూ..మా మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.తెలుగు ప్రేక్షకులకు ఈ మధ్య కొత్త కథలను ఎంకరేజ్ చేయడమే కాకుండా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు బ్రాహ్మరధం పడుతుతున్నారు. ఇప్పుడు మేము కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సెలెక్ట్ చేసుకొని తీస్తున్న మా “డైరెక్టర్ సాబ్” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు కూడా ప్రేక్షకులందరికీ రాబోతున్న మా సినిమా కూడా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

తారాగణం:
రమణ భార్గవ, పింగ్ పాంగ్ సూర్య,రిమ్‌జిమ్ శర్మ, జోగి బ్రదర్స్ (జోగి నాయుడు, కృష్ణంరాజు) అశోక్ కుమార్, జేఎల్ శ్రీనివాస్, చిన్నా, చిత్రం శీను, నరసింహరాజు, జెమినీ సురేష్, వినోద్ బాలా, పి కృష్ణ (కెజిఎఫ్ 2 ఫేమ్), సుచరిత, భరత్ రాజ్, కెఆర్ వెంకటేష్

సాంకేతిక నిపుణులు :
లిరిక్స్, డైలాగ్స్,కథ & స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : హార్తీక్,
డి ఓ పి: గణేష్ అర్లీ,
సంగీతం: సారథి ఆర్‌జి,
ఎడిటింగ్: శాంసన్,
గాయకులు: శ్రావణి, సారథి RG, ప్రియాంక G,
PRO: లక్ష్మీనివాస్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News