పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా”

Must Read

నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా”. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ నివ్వగా, సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ – మంచి కథ, కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్పెక్ట్ గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్ టైనింగ్ గా రూపొందిస్తున్నాడు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీకి నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.

దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ – తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. మాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్ శరత్ గారికి, పృథ్వీ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మేమంతా అజయ్ పట్నాయక్ గారి టీమ్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ – తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంద. నాయికగా ఇది నా ఫస్ట్ మూవీ. తొలి చిత్రంతోనే మంచి అవకాశం కల్పించిన నిర్మాత శరత్ గారికి, దర్శకుడు వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరో నివాస్ మాట్లాడుతూ – అందరికీ నమస్కారం. మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన గెస్ట్ లు రఘుబాబు గారు, పృథ్వీగారు, ఆర్పీ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మంచి వినోదాత్మక చిత్రమిది. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. అన్నారు.

నటుడు భరద్వాజ్ మాట్లాడుతూ – తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా స్లాప్ స్టిక్ కామెడీతో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు మా దర్శకుడు వెంకటేష్. మూవీ కోసం మేమంతా టీమ్ వర్క్ చేస్తున్నాం. తప్పకుండా సినిమా మీ ఆదరణ పొందుతుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు గారితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

నిర్మాత శరత్ బాబు మాట్లాడుతూ – తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా పేరులో గుర్తులేదు ఉంది గానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. మా మూవీకి సపోర్ట్ గా నిలుస్తున్న పృథ్వీ గారికి థ్యాంక్స్. అలాగే యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్ తో సినిమా నిర్మిస్తున్నాం. ఫస్ట్ చిత్రంతోనే ఒక సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తామని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

నటీనటులు – నివాస్, అమిత శ్రీ, 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, జెమిని సురేష్, భరద్వాజ్, ఖయ్యూం, సునీల్ రావి నూతల తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – అభిలాష్, ఎం
సంగీతం- అజయ్ పట్నాయక్
పీఆర్ఓ – బి. వీరబాబు.
బ్యానర్ – చెన్నా క్రియేషన్స్
నిర్మాత – శరత్ చెన్నా
దర్శకత్వం – వెంకటేష్ వీరవరపు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News