టాలీవుడ్

‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది

సెంటిమెంట్ కాదు… ‘ఆర్ఎక్స్ 100’కి, ‘బెదురులంక 2012’కు యాదృశ్చికంగా అలా కుదిరింది – హీరో కార్తికేయ ఇంటర్వ్యూ

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

కార్తికేయకు 2012 అంటే మీకు ఏం గుర్తుకు వస్తుంది?
యుగాంతమే. అప్పట్లో నేను కాలేజీలో ఉన్నాను. వార్తల్లో, చర్చల్లో యుగాంతం అని ఎక్కువ వినిపించింది. హాలీవుడ్ సినిమాలు కూడా రెండు మూడు వచ్చాయి. అవి చూశా.

2012లో కార్తికేయకు, ఇప్పుడు 2023లో కార్తికేయకు మీరు గమనించిన మార్పు ఏమిటి?
మెచ్యూరిటీ పెరిగింది. అప్పుడు జీవితం అంతా తెలుసు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమీ తెలియదని అర్థమైంది. అప్పట్లో చేష్టలు పిల్లల తరహాలో ఉండేవి. ఇప్పుడు కాస్త పద్ధతిగా ఉంటున్నాను.

‘బెదురులంక 2012’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఆ కథ ఏమిటి?
అజయ్ భూపతి ద్వారా దర్శకుడు క్లాక్స్ నాకు పరిచయం అయ్యారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర వాళ్ళిద్దరూ కొలీగ్స్. కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా.

మీకు చెప్పిన కథను దర్శకుడు క్లాక్స్ తెరపైకి తీసుకొచ్చారా?
నిజం చెప్పాలంటే… ఈ కథ విన్నప్పుడు నాకు విజువల్ ఏమీ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్… కమర్షియల్ కథ విన్నప్పుడు అంతకు ముందు సినిమాల్లో విజువల్స్ ఫ్లాష్ అవుతాయి. సీన్స్ కొన్ని గుర్తు వస్తాయి. ‘బెదురులంక 2012’ కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నాను. రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. పంచ్ టు పంచ్ డైలాగులా కాకుండా సిట్యువేషన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ ఎక్కువ ఉంటుంది.

శివ శంకర వరప్రసాద్ పేరు మీరే సజస్ట్ చేశారట!?
సినిమాలో క్యారెక్టర్ పేరు శివ. ఆ సన్నివేశం దగ్గర ‘శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు’ అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనుకుంటున్నాం. సెట్‌లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాకు ఆ షాట్‌లో అలా చెప్పాం.

శివ క్యారెక్టర్ గురించి చెప్పండి!
శివ ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విష

యం చేయమంటే అసలు చేయడు.

రామ్ చరణ్ ట్రైలర్ విడుదల చేశారు కదా! ఆయన ఏమన్నారు?
ఆయనకు ట్రైలర్ నచ్చింది. మ్యూజిక్ బావుందని చెప్పారు. షాట్స్ మేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. నా గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం.

మీకు, నేహా శెట్టి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి? ప్రేమకథ ఎలా ఉండబోతుంది?
సిటీ నుంచి ఊరికి వచ్చిన యువకుడిగా నా క్యారెక్టర్ ఉంటే… బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన ప్రెసిడెంట్ గారి అమ్మాయిగా నేహా శెట్టి కనబడుతుంది. శివతో ప్రేమలో ఉంటుంది. శివ స్ట్రాంగ్ క్యారెక్టర్. అందరి ముందు ఐ లవ్యూ చెబుతాడు. ప్రేమించిన అబ్బాయికి లవ్యూ చెప్పడానికి అమ్మాయి భయపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండాలో, ఆ పరిధి మేరకు ఉంటాయి. సీన్స్ అన్ని క్యూట్ గా ఉంటాయి. సాంగ్స్, సీన్స్ షూట్ చేసినప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని అర్థమైంది.
డీజే టిల్లు’తో నేహా శెట్టికి క్రేజ్ వచ్చింది. మీ సినిమాలో పల్లెటూరి అమ్మాయి రోల్. దాని గురించి ఏమైనా భయపడ్డారా?


సినిమా స్టార్ట్ చేసినప్పుడు భయపడ్డాం. నేహా శెట్టి మంచి నటి. ‘డీజే టిల్లు’లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో… సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం.

‘ఆర్ఎక్స్ 100’లో మీ క్యారెక్టర్ శివ, గోదావరి నేపథ్యంలో కథ! ‘బెదురులంక 2012’లోనూ మీ పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా! సెంటిమెంట్‌ అనుకోవచ్చా?
యాదృశ్చికంగా జరిగింది. కథ నచ్చి రెండు సినిమాలు చేశా. క్యారెక్టర్ పేరు శివ అని చెప్పినప్పుడు క్లాక్స్ తో అనలేదు. చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు. ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.

కొత్త దర్శకుడు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా… నిర్మాత బెన్నీ ముప్పానేని సహకారం ఎలా ఉంది?
కథ 2012 నేపథ్యంలో, పల్లెటూరిలో జరుగుతుంది. ప్రజలు పరుగులు తీసే సీన్ ఒకటి ఉంది. ఎక్కువ మంది జనాలు కావాలి. ఖర్చు విషయంలో నిర్మాత అసలు రాజీ పడలేదు. కథ చెప్పడానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకొచ్చారు. కథానాయికగా నేహా శెట్టిని సజెస్ట్ చేశారు. ఆయన నిర్మాణంలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.

మణిశర్మ ఈ సినిమాకు ఎటువంటి బలాన్ని ఇచ్చారు?
మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్‌కోర్స్… సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే… ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు.

సాధారణంగా మణిశర్మ ఇంటర్వ్యూలు ఇవ్వరు. మీరు ఆయన్ను ఎలా ఒప్పించారు?
మణిశర్మ గారు ఓ బైట్ ఇస్తే బావుంటుందని అనిపించింది. ఆ విషయం దర్శకుడికి చెప్పా. క్లాక్స్ ఆయన్ను అడిగితే… ‘బైట్ ఎందుకు? నువ్వు, కార్తికేయ రండి. మనం మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూలా చేద్దాం! నేను ఇన్ని సినిమాలు చేశా. ఇటువంటి సినిమా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ సినిమా చేసిన ఫీలింగ్ ఉంది’ అని చెప్పారట. ఈ సినిమాకు రీ రికార్డింగ్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు.

‘బెదురులంక 2012’ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కారణాలు ఏంటి?
కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాను. సినిమాలు ప్రకటించలేదు గానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జానర్ ఫిల్మ్ అది. ప్రశాంత్ అని కొత్త దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నాను. మరో రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

‘ఆర్ఎక్స్ 100’కు సీక్వెల్ ఆశించవచ్చా?
‘ఆర్ఎక్స్ 100 – 2’ అని కాదు. అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. సరైన కథ కుదరాలి. కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం. అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తాం.

‘వలిమై’తో మీకు తమిళనాడులో మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకని, తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమాలు చేయడం లేదు?
‘వలిమై’ తర్వాత తమిళ ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అందుకని, ప్రతి సినిమాను తమిళ భాషలో విడుదల చేయాలని అనుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ అనుకున్నప్పుడు బైలింగ్వల్ చేస్తా. ‘వలిమై’ తర్వాత తమిళం నుంచి రెండు మూడు అవకాశాలు వచ్చాయి కానీ నాకు ఎగ్జైటింగ్ అనిపించలేదు. అందుకని, ఆ సినిమాలు చేయలేదు.

చిరంజీవి గొప్పతనం గురించి ఇటీవల మీరు చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు అభిమానిగా చేసినవేనా?
ఓ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పా. ఆయనకు నేను అభిమానిని. అంత కంటే ఎక్కువగా నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి గారు. సినిమాల పట్ల నాలో బాధ్యత పెంచిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనలా డ్యాన్సులు చేయాలని, హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చా. మా ఇంట్లో అమ్మ కూడా ‘వీడు ఒక్క పని సరిగా చేయడు. సినిమా అంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు’ అంటుంది. రెస్పాన్సిబిలిటీ రావడానికి కారణం ఆయన

Tfja Team

Recent Posts

Raghavendra Rao unveiled the glimpses of the movie Abhimani

Film journalist and producer Suresh Kondeti has become very popular on social media. Having already…

15 hours ago

రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో…

15 hours ago

“రామ్ నగర్ బన్నీ” సినిమా యునానమస్ సూపర్ హిట్ టాక్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా…

15 hours ago

“Ram Nagar Bunny” Movie Success meet held Grandly

'Attitude star' Chandrahass debut movie "Ram Nagar Bunny". Vismaya Sri, Richa Joshi, Ambika Vani and…

15 hours ago

మా నాన్న సూపర్ హీరో” ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మా నాన్న సూపర్ హీరో’ టీజర్‌ను ఆవిష్కరించినప్పటి నుండి భారీస్థాయిలో…

15 hours ago

Mahesh Babu Launched Trailer Of Maa Nanna Superhero

Nava Dalapathy Sudheer Babu’s wholesome family entertainer Maa Nanna Superhero is making huge noise, ever…

15 hours ago