శ్రీతేజ్, రత్నాకరం అనిల్ రాజు, శ్రీధర్ గంగపట్నం, ఎస్వీకె సినిమాస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ టైటిల్ ‘రాంబో’ – ఫస్ట్ లుక్ విడుదల
ఎన్టీఆర్ మహానాయకుడు, నారప్ప, పుష్ప, ధమాకా లాంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న శ్రీతేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీతేజ్ హీరోగా ‘హిడింబ’ లాంటి థ్రిలింగ్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో నిర్మాత శ్రీధర్ గంగపట్నం ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు.
శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘రాంబో’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. ఫస్ట్ లుక్ లో శ్రీతేజ్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్ లో ఫెరోషియస్ గా కనిపించారు. రాంబో టైటిల్, శ్రీతేజ్ టెర్రిఫిక్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఇటివలే వైజాగ్ షెడ్యుల్ పూర్తి చేయడంతో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ పాటలని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శ్యామ్ కె నాయుడు, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సమకూరుస్తున్నారు. కోటగిరి వేంకటేశ్వర రావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి కె వి రమణ ఆర్ట్ డైరెక్టర్. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
నటీనటులు : శ్రీతేజ్, రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపి, ,గోలిసోడ మధు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం : రత్నాకరం అనిల్ రాజు
నిర్మాత : శ్రీధర్ గంగపట్నం
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, సునీల్ కుమార్ నామా
ఎడిటింగ్ : కోటగిరి వేంకటేశ్వర రావు
సంగీతం : సునీల్ కశ్యప్
కొరియోగ్రఫీ : శేఖర్ VJ, ఈశ్వర్ పెంటి
స్టంట్స్ : రామకృష్ణ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్ : కె వి రమణ
పీఆర్వో: వంశీ – శేఖర్
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి…
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…