చిట్టి పొట్టి సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 3న రిలీజ్

Must Read

రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “చిట్టి పొట్టి”. ఈ చిత్రాన్ని భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “చిట్టి పొట్టి” సినిమా అక్టోబర్ 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

అతిథిగా వచ్చిన డా.కేర్ గ్రూప్ ఛైర్మన్ ఏ.ఎం రెడ్డి మాట్లాడుతూ – “చిట్టి పొట్టి” సినిమాను ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుని క్వాలిటీగా మూవీని రూపొందించారు భాస్కర్ గారు. మంచి కంటెంట్ తో పాటు పాటలు, నటీనటుల సెలెక్షన్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ – “చిట్టి పొట్టి” సినిమా పాటలకు మంచి స్పందన వస్తోంది. మా డైరెక్టర్ భాస్కర్ గారు ఎంతో అభిరుచితో పాటలు చేయించుకున్నారు. మంచి లిరిక్స్ కుదిరాయి. మా మూవీ ఆల్బమ్ ఎంత హిట్ అయ్యిందో సినిమా కూడా అంతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ కస్వి మాట్లాడుతూ – మా “చిట్టి పొట్టి” సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అక్టోబర్ 3న మా సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ ను మీరంతా తప్పకుండా ఇష్టపడతారని తెలుసు. మా “చిట్టి పొట్టి” సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ పవిత్ర మాట్లాడుతూ – “చిట్టి పొట్టి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్. కస్వి, రామ్ తో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. మేమంతా ఫ్యామిలీలా మారిపోయాం. “చిట్టి పొట్టి” సినిమాను మీరంతా తప్పకుండా థియేటర్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి మాట్లాడుతూ – మా “చిట్టి పొట్టి” సినిమా పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా బాగుందనే ప్రశంసలు దక్కుతున్నాయి. అన్నా చెల్లెలు మధ్య అనుబంధం నేపథ్యంలో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి ఒక్క కుటుంబంలో అన్నా చెల్లి ఉంటారు. వాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. మూడు తరాలలో ఒక ఆడపిల్ల ముందు చెల్లెలిగా, తర్వాత మేనత్తగా, ఆఖరికి బామ్మ గా.. మారే జర్నీ లో ఆమె భావోద్వేగాలు, ప్రేమ, కష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. అలాగే ఇప్పుడున్న సోషల్ మీడియా ఒక ఆడపిల్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ సందర్భంలో అన్న తన చెల్లిని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాడు అనేది మీ అందరికీ నచ్చుతుంది. మా చిన్న సినిమాను మీడియా బాగా సపోర్ట్ చేస్తోంది. అక్టోబర్ 3న “చిట్టి పొట్టి” సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో రామ్ మిట్టకంటి మాట్లాడుతూ – ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే ఎలాంటి అద్భుతాలు సృష్టింవచ్చో దర్శకుడు రాజమౌళి గారి ఫ్యామిలీ నిరూపించింది. “చిట్టి పొట్టి” సినిమాలో నటించిన తర్వాత నాకూ ఒక సోదరి ఉంటే బాగుండును అనిపించింది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నా సోదరిగా పవిత్ర బాగా నటించింది. మమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే నిజంగా అన్నా చెల్లి అనుకుంటారు. “చిట్టి పొట్టి” సినిమా మీ హార్ట్ టచ్ చేస్తుంది. కళ్లు చెమర్చకుండా థియేటర్ నుంచి బయటకు రాలేరు. చివరి 20 నిమిషాలు సినిమా అద్భుతంగా ఉంటుంది. అక్టోబర్ 3న థియేటర్స్ లో మా “చిట్టి పొట్టి” సినిమా చూడండి. అన్నారు.

నటీనటులు – రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ – భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
ఎడిటర్ – బాలకృష్ణ బోయ
మ్యూజిక్ – శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం – భాస్కర్ యాదవ్ దాసరి

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News