విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్‌తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ… ‘‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత సత్యనారాయణగారు, హీరో సుమన్, హెబ్బా పటేల్ ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
మన చౌదరి మాట్లాడుతూ… ‘‘సందేహం’ సినిమా నుంచి రిలీజైన ‘చచ్చినా చావని ప్రేమిది’ పాట చాలా బావుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి నాకు తెలుసు. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తోన్న ఈ పాటను పూర్ణాచారి రాశారు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్. శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…