‘రేవు’ చిత్రం పై సినీ ప్రముఖుల ప్రశంసలు

Must Read

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ అయి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. సెలెబ్రిటీ షోల్లో సినిమాను వీక్షించిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రేవు సినిమా ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. ఇంత మంచి కాన్సెప్ట్‌తో సినిమాను నిర్మించిన మురళీ గారికి థాంక్స్. అందరూ చూడాల్సిన సినిమా. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. అందరూ కొత్త వారైనా కూడా ఎంతో సహజంగా నటించారు. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘రేవు సినిమా అద్భుతంగా ఉంది.. మరీ ముఖ్యంగా సెకండాఫ్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. నేను రికమండ్ చేస్తున్నాను. ఇది అందరూ చూడాల్సిన సినిమా. డైరెక్టర్ టేకింగ్, మేకింగ్ అదిరిపోయింది. అందరూ తప్పకుండా థియేటర్లో ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘రేవు టైటిల్ వినగానే ఓ డాక్యుమెంటరీలా ఉంటుందని అనుకున్నాను. కానీ ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా అద్భుతంగా తీశారు. దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులంతా కొత్త వాళ్లే. అందరూ కొత్త వాళ్లే అయినా ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ మూవీకి ప్రభు గారు, జర్నలిస్ట్ గారు బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది’ అని అన్నారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘రేవు చిత్రం చాలా బాగుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్‌లో సినిమా రావడం అరుదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒకే టెంపోలో సాగింది. కెమెరామెన్ పనితనం అద్భుతంగా ఉంది. వంశీ, అజయ్ అద్భుతంగా నటించారు. విలన్స్ కూడా బాగా నటించారు. అంతా కొత్త వాళ్లే అయినా అద్భుతంగా నటించారు. ఇలాంటి సినిమాను నిర్మించిన మురళీ గారికి ఆల్ ది బెస్ట్. మంచి యాక్షన్, ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. ప్రతీ పాత్రకు ఓ ఎమోషన్ ఉంటుంది. ప్రభు గారు లైన్ ప్రొడ్యూసర్‌గా, రాంబాబు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడండి’ అని అన్నారు.

జబర్దస్త్ రాకేష్ మాట్లాడుతూ.. ‘ప్రభు లాంటి సీనియర్ జర్నలిస్టులు ఇలాంటి చిత్రాల వెనుక ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాయి. మా లాంటి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. రేవు సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతీ ఒక్కరూ ఈ మూవీని తప్పకుండా చూడండి’ అని అన్నారు.

రేవు సినిమాకు వచ్చిన మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూల మీద సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన సోషల్ మీడియాలో రేవు గురించి ప్రత్యేకంగా పోస్ట్ వేశారు. రేవు గురించి వస్తున్న రివ్యూలు, పబ్లిక్ టాక్ వింటున్నాను.. సినిమా టీంకు కంగ్రాట్స్ అని పోస్ట్ వేశారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News