టాలీవుడ్

B&W (బ్లాక్ & వైట్) చిత్ర టీజర్‌ విడుదల

గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం B&W (బ్లాక్ & వైట్). పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్‌ఆర్ ఆర్ట్స్/ ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సహకారంతో ఎ మేఘనా రెడ్డి సమర్పిస్తున్నారు. ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్, రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. టీజర్‌ను లాంచ్ చేసిన అనంతరం.. మూవీ సక్సెస్ కావాలని ఆయన ఆకాక్షించారు.ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించారు.చిత్ర టైటిల్‌కు తగ్గటే.. ట్రైలర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది.

‘‘నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సూర్య శ్రీనివాస్‌తో సహా చాలా పాత్రలను టీజర్‌లో అనుమానాస్పద రీతిలో చూపించారు. లహరి, నవీన్ నేని పాత్రలను కూడా టీజర్‌లో చూపించారు.ఉత్కంఠభరితమైన ఈ టీజర్.. థ్రిల్లర్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో యువతకు నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. టీజర్‌ కట్‌తో దర్శకుడు సూర్య ప్రకాష్‌ ఆసక్తిని రేకెత్తించాడు. టీజర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టి సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతోంది., అజయ్ అరసాడ సంగీతం అందించారు. బి&డబ్ల్యూ (బ్లాక్ & వైట్) చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని, సురేష్ బాబు, కిషోర్ కుమార్, అమ్ములు ఆర్కే, వంశీ బి & ఇతరులు.
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ఎల్‌ఎన్‌వీ సూర్య ప్రకాష్ నిర్మాతలు: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి
సమర్పణ: ఎ మేఘనా రెడ్డి
బ్యానర్లు: ఎస్‌ఆర్ ఆర్ట్స్/ ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
సంగీతం: అజయ్ అరసాడ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అషీర్ లూక్ అండ్ డి. సుమన్ జె
డీవోపీ: టి సురేంద్ర రెడ్డి
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్ డైరెక్టర్: వంశీ బోయిన
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల
గాయకులు: యాజిన్ నిజార్ లిప్సిక-చిన్మయి

సాహిత్యం: శ్రీమణి
కొరియోగ్రఫీ: కళాధర్ అండ్ పోలాకి విజయ్
పీఆర్‌ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

18 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago