హాస్పిటల్లో ఉన్న బాలుడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న నిర్మాత బన్నీవాస్

ఈనెల 5వ తేదీన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ వివిధ రకాల నాలుగో తేదీ సాయంత్రం నుండి పలుచోట్ల ఈ చిత్ర ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షో జరిగింది. అయితే ప్రతి సినిమాకి వెళ్లినట్లే ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లకు వెళ్లడం జరిగింది. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ మధ్య తొక్కేసేలాట జరిగింది. ఆ సంఘటనలో ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయాల పాలయ్యాడు. ఆ సంగతి తెలిసిన అల్లు అర్జున్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన ఆ మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి తన వంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం పండగ చేస్తానని, అలాగే ఆ కుటుంబానికి ఏ విషయంలో అయినా అండగా ఉంటాను అని తెలిపారు. ఆ బాలుడికి కావలసిన వైద్య సదుపాయాల నిమిత్తం ఖర్చు అంతా తానే చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది.

కాగా నేడు గీత ఆర్ట్స్ (GA2) నిర్మాణ సంస్థలో ప్రధాన వ్యక్తి బన్నీవాస్ ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి, అతడిని చూసి, తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో సంప్రదించి తెలుసుకోవడం జరిగింది. చనిపోయిన మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాక వారికి ఎటువంటి విషయంలో అయినా తాము అండగా ఉంటామని, హాస్పిటల్ కు సంబంధించిన ఖర్చుమంతా తాము మరుస్తామని ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ వారికి చెప్పడం జరిగింది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago