సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజాUI ది మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో ఈ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
‘UI’ కాన్సెప్ట్, ఐడియా ఎలా మొదలైంది ?
-మన ఎడ్యుకేషన్ సిస్టం లో ఏ ఫర్ ఆపిల్.. బి ఫర్ బ్యాట్.. ఇలా నేర్పించారు. వాళ్లు ఏం చెప్తే అది బైహాడ్ చేసుకుని దాన్నే నేర్చుకున్నాం. అదొక సిస్టంలాగా మారిపోయింది. దీనివలన మన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అప్పుడే ఏ ఫర్ ఆపిల్ తో ఇంకొన్ని వర్డ్స్ చెప్పుంటే మన ఆలోచన మరోలా ఉండేది. నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచననే చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాను.
-UI ఆలోచన కూడా అలా వచ్చినదే. యు అండ్ ఐ… మీలోనూ నాలోను ఒకటే కథ ఉంది. నేను ఆలోచిస్తున్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారా? క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి. నేను ఫీల్ అవుతున్నాదే మీరూ ఫీల్ చేస్తున్నారు. ఇది ఆడియన్స్ తో ఇంటరాక్టివ్ అయ్యే సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకులే చాలా విషయాల్ని డీకోడ్ చేస్తారు. ఈ సినిమాని మెటాఫరికల్ చేశాం.
-నా వరకు థియేటర్లో కూర్చుని సినిమా చూసిన ఆడియన్స్ అసలైన స్టార్స్. నా మొదటి సినిమాతోనే దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆడియన్స్ ఒక ఫిలిం మేకర్ కంటే పైనే ఉంటారు. ఈ సినిమాతో ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతారు.
అమీర్ ఖాన్ ని కూడా మీ సినిమా కదిలించింది కదా ?
-అమీర్ ఖాన్ గారు చాలా బిగ్ స్టార్. ఆయనకి మా సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అదంతా ఆయన గొప్పతనం. ఆయన సినిమా గురించి మాట్లాడారు. అది మాకు చాలా హెల్ప్ అయింది.
మీ సినిమాల్లో ఒక ఆవేశం ఉంటుంది. అలాంటి కథలు చెప్పాలనే ధైర్యం మీకు ఎలా వచ్చింది?
-ఇదంతా ఆడియన్స్ గొప్పతనం గానే భావిస్తాను నా సినిమాలన్నింటి గురించి చాలా చక్కగా డీకోడ్ చేసి అంతాలా గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది.
ఈ సినిమా వార్నర్ వీడియోలో కల్కి లాంటి కాంప్లెక్స్ కనిపించింది.. దాని గురించి చెప్పండి?
-అందులో మైథిలాజికల్ కల్కి చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కి చూస్తారు (నవ్వుతూ)
మీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. లుక్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
-నిజానికి లుక్ విషయంలో ఇందులో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏడాది స్క్రిప్ట్ కి పడితే మరో ఏడాది లుక్, క్యారెక్టర్ డిజైన్ కే పడుతుంది.
యూ ఐ టెక్నికల్ వాల్యూస్ గురించి ?
-ఆర్ డైరెక్టర్ శివకుమార్ ఒక సర్రియల్ వరల్డ్ క్రియేట్ చేశారు. చాలా డిఫరెంట్ సెట్స్ డిజైన్ చేశాం. ఇందులో ఉండే సెట్స్ మొదట్లో చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. తర్వాత డీకోడ్ చేసినప్పుడు దాని వెనుక ఉన్న మీనింగ్ అర్థం అవుతుంది.
-అజ్నీస్ లోక్ నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. తను పాన్ ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు చాలా టైం ఇచ్చి చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. హంగేరీ లో రికార్డింగ్ చేసాము. చాలా వండర్ ఫుల్ గా వచ్చింది.
సినిమా రన్ టైం గురించి?
-టు అవర్స్ టెన్ మినిట్స్ ఉంటుంది. నాకు ఏదైనా విషయాన్ని లాగ్ చేసి చెప్పడం ఇష్టం ఉండదు. సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది.
సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో మళ్లీ సినిమా చేయకపోవడానికి కారణం?
-అల్లు అర్జున్ నా ఫేవరెట్ యాక్టర్. నేను ఆయనకి ఫ్యాన్ ని. అలాగే త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. ఆ ఇద్దరు కాంబినేషన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కథలు వచ్చాయి. అయితే నా మూవీ వర్క్స్ ఉండడం వల్ల చేయడం కుదరలేదు.
మీ సినిమాలకి సీక్వెల్స్ చేసే ఆలోచన ఉందా?
-లేదండి. నా కథలకు పార్ట్ 2 చేసే ఆలోచన నాకు రాదు. ఇంకా ఏమైనా కొత్త కథలు చెప్పాలని ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ దీనికి రెండో పార్ట్ కూడా చేయాలని అంటే అప్పుడు ఆలోచిస్తాను (నవ్వుతూ)
మీ కథల్లో బాధ పెట్టే వాళ్ళ కంటే బాధపడే వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేస్తారు? దాని గురించి చెప్పండి?
-మీరన్నది కరెక్టే. మనం ఎక్కువగా ప్రాబ్లం గురించే మాట్లాడుతాం. సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వడం చాలా డిఫికల్ట్. ఈ విషయంలో కొంచెం ట్రై చేస్తాను. సొల్యూషన్ ఇక్కడే ఉంది దాని గురించి ఆలోచించండి అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది జాలీగా సినిమా చూసి వెళ్లిపోతారు.
మీ సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఉంటాయి కదా.. సెన్సార్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు?
-‘ ఓం’ సినిమాకి చాలా ప్రాబ్లం అయింది. తర్వాత నా ‘ఏ’ సినిమా చూసి థిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఫిట్ ఫర్ రిలీజ్ అని వెళ్ళిపోయారు. తర్వాత రివైజ్ కమిటీలో ఎక్స్ట్రాడినరీగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. నా కథలు, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి. బహుశా అందుకే అలా రియాక్ట్ అయి ఉంటారని భావించాను. ఈ సినిమా వరకు ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చారు.
ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే సినిమాలు తీయాలనేది మీ ఉద్దేశమా?
లేదండి. సినిమా అనేది ఎప్పుడూ కూడా ఎంటర్టైన్మెంట్ మీడియా. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వస్తారు. ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. ఈ సినిమాలో కూడా సాంగ్స్ ఫైట్స్ మంచి మ్యూజిక్ విజువల్ గ్రాండియర్ అన్ని ఉన్నాయి. నార్మల్ గా చూసినప్పుడు ఒక మంచి సినిమా లాగా ఉంటుంది. కొంచెం డీప్ గా వెళ్తే ఇంకొక లేయర్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్ లో చూస్తే ఒక పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. అన్ని ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఒక ఫిలిం మేకర్ గా ఏదైనా మార్పు చేయాలని ఆలోచన ఉంటుందా ?
మార్చడానికి నేను ఎవరిని? నన్ను నేనే మార్చుకోలేకపోతుంటాను. నేను మెసేజ్ ఇవ్వను. తీసుకోను. ఈ సినిమాలో కూడా అదే చెప్పాను (నవ్వుతూ).
ఒకప్పటికి ఇప్పటికీ ఫిలిం టెక్నాలజీలో ఎలాంటి మార్పు వచ్చింది?
-చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఒక రూమ్ లో కూర్చుని ఒక ఫిలిం తయారు చేయొచ్చు. అయితే టెక్నాలజీని ఎలా వాడుతున్నాం అనేదాని మీదే అంత డిపెండ్ అయి ఉంటుంది.
మీ పోస్టర్స్ చాలా యూనిక్ గా ఉంటాయి దాని గురించి చెప్పండి?
నిర్మాతల గురించి?
అందరూ కెప్టెన్ అఫ్ ది షిప్ ఇంపార్టెంట్ అంటారు. నేను మాత్రం ఓనర్ ఆఫ్ ది షిప్ ఇంపార్టెంట్ అని అంటాను. (నవ్వుతూ) ఈ సినిమాకి ఇంత పెద్ద స్కేల్లో ఖర్చు పెట్టి తీశారు అంటే ఆ క్రెడిట్ అంతా నిర్మాతలకే దక్కుతుంది. నిర్మాతలు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని తీశారు. చాలా సపోర్ట్ ఇచ్చారు.
-సినిమాకి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అంతా టీం వర్క్.
రజనీకాంత్ గారితో కూలీ సినిమా చేస్తున్నారు కదా.. ఎలా అనిపించింది ?
-ఆయనతో వర్క్ చేయడం నా లైఫ్ డ్రీమ్. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో సినిమా చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…