విజయీభవ ఆర్ట్స్ పతాకం పై నందు విజయ్‌కృష్ణ హీరోగా.. యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడు గా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ సినిమాలోని పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో..ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హీరో నాగ సౌర్య, డి. జె. టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ,సెవెన్ హిల్స్ సతీష్, శ్రీని ఇన్ఫ్రా శ్రీను, సురేష్ కొండేటి, శేషాద్రి, నటులు సుడిగాలి సుధీర్, దనరాజ్, సత్యం రాజేష్, లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన హీరో నాగ సౌర్య మాట్లాడుతూ. మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. థియేటర్స్ నుండి వచ్చిన ఆర్టిస్టులు అందరినీ ఈ సినిమాకు తీసుకువచ్చి వారికి అవకాశం కలిపించడం చాలా గ్రేట్, కెమెరామెన్ విజువల్స్ బాగున్నాయి హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు.మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన, దర్శక,నిర్మాతలకు మరియి చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా టైటిల్ మాదిరే ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
డి. జె. టిల్లు డైరెక్టర్ విమల్, కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అని టైటిల్ లోనే సగం విజయం ఉంది . దర్శకుడు రాజ్ విరాట్ కు ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలి, నందు, రష్మి ఇంకా చాలా సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుతూ మంచి టైటిల్ తో వస్తున్న సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలిని అన్నారు.సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. అందరూ బాగుండాలని ఎంతో మందికి హెల్ప్ చేస్తున్న రష్మీ ని చూసి ఇన్స్పెర్ అయిన చాలా మందిలో నేను ఒకణ్ణి,ఆలా అందరూ బాగుండాలని కొరుకొనే తనకు, మరియు నందుకు, దర్శక, నిర్మాతలకు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర హీరో నందు మాట్లాడుతూ..దర్శకుడు .రాజ్ విరాట్ ఇచ్చిన మంచి కథకు రష్మీ అయితే బాగుంటుందనుకొని తనకు ఈ కథ ఎలా చెప్పాలని తన దగ్గరికి వెళ్లిన నాకు ఈ కథను నువ్వు నమ్మి ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే నీ పై నాకు నమ్మకం ఉందని నన్ను నమ్మి కథ కూడా వినకుండానాకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది రష్మీ .తనకు ఈ సినిమా షూట్ చేస్తున్న టైమ్ లో తనకు మేము సరైన సదుపాయాలు కల్పించలేక పోయినా తను మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ఈ సినిమా ను అందరూ కొత్త వారితో తీస్తున్నాము.ఈ సినిమా 25% షూట్ అయిపోయిన తర్వాత సినిమాని ఇలా కాదు నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లాలని అనుకున్న బడ్జెట్ కంటే భారీ స్థాయిలో తీసుకొచ్చిన విజయీభవ ఆర్ట్స్ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ గార్లకు ధన్యవాదాలు అన్నారు.
చిత్ర నిర్మాతలు బోసుబాబు నిడుమోలు, ప్రవీణ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి లు మాట్లాడుతూ..విరాట్, నందు, రష్మీ లు ఎంచుకొన్న కథ బిగ్ బడ్జెట్ మూవీ మాకు నచ్చడంతో వీరికి సపోర్ట్ చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాలని మా నలుగురు కలిసి ఈ సినిమా తీశాము . ఈ సినిమాకు ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం నందు, రష్మిక, డైరెక్టర్, ఆర్టిస్టులు ఇలా అందరూ చాలా కష్టపడ్డారు.. ఇలా అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా ఇంత బాగా వచ్చింది. దర్శకుడు విరాట్ మేకింగ్ చాలా బాగుంది, ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరోయిన్ రష్మిక గౌతమ్ మాట్లాడుతూ.. నాది, నందుది 14 సంవత్సరాల జర్నీ. దర్శకుడు రాజ్ విరాట్ చెప్పిన కథను నందు నమ్మితే, నేను నందును నమ్మి సినిమా చేస్తున్నాను.కొత్త ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యాలని ఉద్దేశ్యం తో చాలా మంది కొత్త వారిని సెలెక్ట్ చేశారు. అందరూ చాలా బాగా పని చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. విజయీభవ ఆర్ట్స్ వారు మా మీద నమ్మకంతో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. మా చిన్న సినిమాకు నవంబర్ 4 మంచి డేట్ దొరికింది.అందరూ థియేటర్ కు వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు రాజ్ విరాట్ మాట్లాడుతూ..ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక పోతురాజు అనే క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తారు. ఆ పోతురాజు క్యారెక్టర్ ను, క్రెజీ నెస్ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.ఈ సినిమా కొరకు నటీ నటులు అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. దాంతో సినిమా బాగా వచ్చింది. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో..ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది.నా షార్ట్ ఫిల్మ్స్ ను చూసి మేము చేస్తున్న ఈ సినిమాను నమ్మి, మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి మా ధన్యవాదములు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారి మాట్లాడుతూ.. ఇందులో పాటలు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల 4 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు
నటీనటులు
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరిటి, రఘు కుంచె తదితరులు
సాంకేతిక వర్గం
రచన – దర్శకత్వం : రాజ్ విరాట్
నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి
పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
ఎడిటర్ : బి. సుభాష్కర్
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
The film Drinker Sai stars Dharma and Aishwarya Sharma in the lead roles, with the…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Iconic star Allu Arjun has created a new chapter in the history of Hindi cinema…
'పుష్ప-2' ది రూల్ వైల్డ్ ఫైర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్లో ఐకాన్‌స్టార్ సరికొత్త చరిత్రఐకాన్స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు…
సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా…
Starring Superstar Suresh Gopi, Anupama Parameswaran in lead roles, Janaki Vs State of Kerala (JSK)…