డబుల్ ఇస్మార్ట్ లో బోల్డ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: కావ్య థాపర్ 

Must Read

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్స్ లోకి ఎలా వచ్చారు ? 

-పూరి సర్, ఛార్మి గారిని కలసి ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్ వారికి నచ్చింది. అయితే సమయంలో ఓ చిన్న యాక్సిడెంట్ గా కారణంగా కాస్త వెయిట్ పెరిగాను. కొంచెం వెయిట్ తగ్గమని చెప్పారు. రెండు నెలలు హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గాను. పూరి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి ఫిట్ అయ్యాను.  

-ఇంత అద్భుతమైన కాంబినేషన్ వున్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలౌతున్నాను. రామ్ గారు, సంజయ్ దత్ లాంటి బిగ్ స్టార్ కాస్ట్ వున్న సినిమాలో నేనూ పార్ట్ కావడం చాలా హ్యాపీగా వుంది. అలాగే పూరి గారు, మణిశర్మ గారి కాంబో చాలా ఫేమస్. అలాంటి కాంబో లో వర్క్ చేయడం చాలా థ్రిల్ ఇచ్చింది. 

-నాకు పూరి జగన్నాథ్ గారి హీరోయిన్ అవ్వాలని వుండేది. ఇస్మార్ట్ శంకర్ కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్ టైన్మెంట్ వుండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా వుంది. పూరి గారు గ్రేట్ డైరెక్టర్. ఆయన విజన్ చాలా అద్భుతంగా వుంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.   

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ? 

-ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా వుంటుంది. ఏదైనా సొంతగా నేర్చుకునే అమ్మాయి. తను చాలా స్మార్ట్, అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా వుంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా వున్నాయి. ఒక యాక్టర్ గా ఎప్పటినుంచో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని కొరుకున్నాను. ఈ సినిమాతో అలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను. 

రామ్ గారితో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ? 

-అదొక బెస్ట్ ఎక్స్ పీరియన్స్. సాంగ్ షూట్ లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. సిక్ అవ్వడంతో చాలా అప్సెట్ అయ్యాను. అయినా సెట్ లోకి వచ్చాను. అయితే ఛార్మి గారు నన్ను చూసి ఇమ్మిడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. చాలా కేర్ తీసుకున్నారు. నా కారణంగా షూటింగ్ అప్సెట్ అవుతుందని చాలా బాధపడ్డాను. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్ చార్జ్ అయ్యాను. నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. 

-రామ్ గారు చాలా పాషనేట్ యాక్టర్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హైలీ ఎనర్జిటిక్ గా వుంటారు. తను అమెజింగ్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా కెమిస్ట్రీ ది బెస్ట్ వచ్చింది.   

సంజయ్ దత్ గారితో మీకు కాంబినేషన్ సీన్స్ వున్నాయి ? 

-వున్నాయి. ఆయనతో వర్క్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన లెజండరీ యాక్టర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ లా అనిపించింది. 

పూరి గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ? 

-ఓర్పుగా వుండటంతో పాటు చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సెట్ లో చాలా కూల్ గా వుంటారు. ఆయనలో మంచి ఫిలాసఫర్ కూడా వున్నారు. జీవితం పట్ల ఆయనకి వున్న క్లారిటీ అమెజింగ్.      

ఛార్మి గారితో కలసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 

-ఛార్మి మేడమ్ బాస్ లేడీ. నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నారు. తను పవర్ హౌస్. చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. హ్యాట్సప్ టు ఛార్మి గారు. 

ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ ఎలా వుండబోతోంది ? 

-డబుల్ ఇస్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ వుంది. ఇస్మార్ట్ శంకర్ కి దీనికి కంపారిజన్ లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేశాను. ఆగస్ట్ 15 కోసం ఎదురుచూస్తున్నాను.

డబుల్ ఇస్మార్ట్ మీ ఫేవరేట్ సాంగ్ ? 

-మార్ ముంత ఛోడ్ చింతా, స్టెప్పా మార్ నా ఫేవరేట్. అవి నా మైండ్ నుంచి పోవడం లేదు. అలాగే క్యా లఫ్డా ను కూడా ఎంజాయ్ చేశాను. 

-మణిశర్మ గారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం లక్కీగా భావిస్తున్నాను. 

డబుల్ ఇస్మార్ట్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కదా ఈ ఫీలింగ్ ఎలా వుంది ? 

-డబుల్ ఇస్మార్ట్ స్ట్రయిట్ గా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎక్సయిటింగ్ వుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా ఇదొక బ్లెస్సింగ్ లా భావిస్తున్నాను. 

ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ? 

-నాకు యాక్షన్ రోల్స్ చేయాలని వుంది. యాక్షన్ చేయడం చాలా ఇష్టం. అలాగే అడ్వంచరస్ మూవీ చేయాలని వుంది. 

మీ అప్ కమింగ్ మూవీస్ ? 

-గోపిచంద్ గారితో విశ్వం చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో వున్నాయి. 

ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News